iDreamPost
android-app
ios-app

వీడియో: 50 లక్షల కారులో వచ్చి.. బండి మీద బిస్కెట్లు అమ్ముతున్నాడు!

Fortuner Naan Khatai Vendor: కష్టపడి చేసే ఏ వ్యాపారం అయినా చిన్నది కాదు. అందుకు ఈ నేతి బిస్కెట్ల వ్యాపారిని ఉదాహరణగా చెప్పచ్చు.

Fortuner Naan Khatai Vendor: కష్టపడి చేసే ఏ వ్యాపారం అయినా చిన్నది కాదు. అందుకు ఈ నేతి బిస్కెట్ల వ్యాపారిని ఉదాహరణగా చెప్పచ్చు.

వీడియో: 50 లక్షల కారులో వచ్చి.. బండి మీద బిస్కెట్లు అమ్ముతున్నాడు!

డాన్ సినిమాలో బాలీవుడ్ బాద్ షా ఒక డైలాగ్ చెప్తాడు. “కోయీ దందా చోటా నహీ హోతా.. దందేసే బడా కోయి ధరమ్ నహీ హోతా” అంటూ షారుక్ చెప్పిన డైలాగ్ కు థియేటర్లలో విజుల్స్ రీసౌండింగ్ వచ్చాయి. ఆ డైలాగ్ చెప్పిన సందర్భం నెగిటివ్ కావచ్చు. కానీ, ఆ డైలాగ్ సాంరాంశం మాత్రం నూటికి నూరుశాతం నిజం. ఎందుకంటే మనం కష్టపడి చేసే పని ఏదైనా గొప్పదే అవుతుంది. నీతి, న్యాయం, నిజాయతీతో చేసే పనికంటే మరేది గొప్పది కాదు. హార్డ్ వర్క్, డెడికేషన్ ఉంటే ఎలాంటి పనిలోనైనా విజయం సాధించవచ్చు. దాంతో మన జీవితాన్నే మార్చుకోవచ్చు. అదే విషయాన్ని ఈ చిరు వ్యాపారి నిజం చేసి చూపించాడు.

చేసే పని ఏదైనా నీతిగా, న్యాయంగా ఉన్నంతవరకు అది గొప్పదే అవుతుంది. కొంతమంది చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, బండి మీద వస్తువులు అమ్ముకునే వారిని తక్కువ చేసి చూస్తూ ఉంటారు. కానీ, వాళ్ల సంపాదన, వాళ్లు లైఫ్ లో సాధించిన విజయాలు గురించి తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. ఇప్పుడు చెప్పుకోబోయే వ్యాపారి కూడా ఆ కోవకు చెందిన వాడే. అతను చూడటానికి చాలా సాదాసీదాగా ఉంటాడు. బండి మీద నాన్ ఖటాయి అనే బిస్కెట్లు అమ్ముతూ ఉంటాడు. అతడిని చూసిన వాళ్లు ఎవరైనా సాధారణ చిరు వ్యాపారి అనుకుంటారు. కానీ, అతను వచ్చే కారు చూస్తే అంతా షాకవ్వాల్సిందే.

ఎందుకంటే ఆ వ్యాపారి టయోటా ఫార్చునర్ కారులో వస్తాడు. తన కారుని పక్కన పార్క్ చేసి బండి మీద బిస్కెట్లు అమ్ముతూ ఉంటాడు. అతడిని మొదటిసారి చూసిన వాళ్లకి ఎవరికైనా అక్కడ ఏం జరుగుతోందో తెలియడానికి కాస్త సమయం పడుతుంది. సహీ హై అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఇలాంటి వీధివ్యాపారులను పరిచయం చేయడమే కాకుండా.. వారి సంపాదనను వెల్లడిస్తూ ఉంటాడు. అలా ఈ నాన్ ఖటాయి వ్యాపారి గురించి పరిచయం చేశాడు. ఇతడిని మీరు అమృత్ సర్ వీధుల్లో చూడచ్చు. ఫార్చునర్ కారులో వచ్చి ఈ నేతి బిస్కెట్లను విక్రయిస్తూ ఉంటాడు.

రూ.20కి ప్లేటు అమ్ముతున్నావ్. మరి.. రూ.50 లక్షల ఖరీదైన ఫార్చునర్ కారుని ఎలా తీసుకున్నావ్ అని ప్రశ్నించగా.. “ఐదేళ్లుగా వ్యాపారం చేస్తున్నాను. కేజీ రూ.200కు అమ్ముతాను. రోజుకి 20 కిలోల నాన్ ఖటాయి విక్రయిస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. అతడి ఇన్ స్టా పేజ్ లో ఈ వీడియోకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. 12.43 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఒక వీధి వ్యాపారి ఇలా ఫార్చునర్ కారులో వస్తున్నాడని తెలిసి టిప్పు టాపుగా రెడీ అయ్యి ఆఫీసలకు, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ కు వెళ్లే ఉద్యోగులు కూడా నోరెళ్లబెడుతున్నారు. ఈ మాత్రం జీతానికి మాకు మళ్లీ ఐరన్, టక్ ఒకటి అంటూ వారిపై వాళ్లే జోకులు వేసుకుంటున్నారు. మరి.. ఫార్చునర్ కారులో వచ్చి బిస్కెట్లు అమ్ముతున్న ఈ చిరు వ్యాపారిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Chahat Bhalla (@officialsahihai)