iDreamPost
android-app
ios-app

అందమైన అమ్మాయిలు, AK47లతో హంగామా! జైలుకు పంపిన రీల్స్‌ పిచ్చి!

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యూత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పేరు తెచ్చుకోవాలన్న తపనతో పిచ్చి పిచ్చి రీల్స్, షాట్స్ అంటూ తీసి అప్ లోడ్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు ఒక్కొక్కసారి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి.

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యూత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పేరు తెచ్చుకోవాలన్న తపనతో పిచ్చి పిచ్చి రీల్స్, షాట్స్ అంటూ తీసి అప్ లోడ్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు ఒక్కొక్కసారి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి.

అందమైన అమ్మాయిలు, AK47లతో హంగామా! జైలుకు పంపిన రీల్స్‌ పిచ్చి!

పిచ్చి పలు రకాలు అంటుంటారు. సోషల్ మీడియా వచ్చాక నిజమేననిపించకమానదు. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి ఓపెన్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ఫేమస్ అయ్యేందుకు నానా తంటాలు పడుతున్నారు యూత్. సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు తెచ్చుకోవాలని స్టంట్స్ చేసి వార్తల్లో నిలుస్తున్నారు. రీల్స్, షాట్స్, స్నాప్స్ అంటూ పరుగులు పెడుతున్నారు. దీని కోసం జీవితాలను పణంగా పెడుతున్నారు. రైల్వే ట్రాకులపై, ఎత్తైన ప్రదేశాల్లో, జలపాతాల దగ్గర వీడియోలు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న దాఖలాలున్నాయి. మరికొంత మంది ఎచ్చులకు పోయి వీడియోలు చేస్తూ ఇరకాటంలో పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు ఫేమస్ అయ్యేందుకు డాన్ కలరింగ్ ఇచ్చాడు. చివరకు పోలీసులు జైలుకు తరలించి.. అతడికున్న తిక్క తీర్చారు.

ఫేమస్ ఇన్ష్లయెన్సర్ ఒకరు అతి చేసి కటకటాలు పాలయ్యాడు. లగ్జరీకారు నుండి డాన్‌లా దిగాడు. ఏకే-47 తుపాకీలు పట్టుకున్న బాడీగార్డులు..అతడిని అనుసరించారు బాడీగార్డులు. ఆ పక్కనే అందమైన భామలు, ఓ రిచ్ పర్సన్ కలరింగ్ ఇచ్చాడు. దీన్ని వీడియోగా చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. నెటిజన్లు సైతం అతడి చర్యపై మండిపడటంతో పాటు భయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. నిందితుడ్ని అరుణ్ కటారేగా గుర్తించారు. చొక్కనహళ్లి సమీపంలో ఈ స్టంట్స్ చేశాడు అరుణ్. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు.

నిందితుడు చిత్రదుర్గకు చెందిన వాడిగా గుర్తించారు. అవన్నీ నకిలీ తుపాకీ అని, అలాగే నకిలీ బంగారాన్ని ధరించి.. డబ్బున్నోడుగా కటింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడని తేలింది. అందమైన మోడల్స్, ఇద్దరు వ్యక్తులను గన్ మాన్లుగా నియమించుకుని రిచ్ పర్సన్ లా బిల్డప్ ఇచ్చాడు. అలాగే ఇద్దరు మోడల్స్ నియమించుకుని రీల్స్ చేశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. అతడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రీల్స్ పిచ్చితో రిచ్ పర్సన్‌లా కలరింగ్ ఇస్తూ వీడియోలు చేశాడు. నకిలీ తుపాకీలు, బంగారంతో ఓ వీడియో అతడ్ని చిక్కుల్లోకి నెట్టింది. నిందితుడ్ని అరెస్టు చేశారు. జ్యూడిషియల్ కస్టడీకి తరలించి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.