Krishna Kowshik
ఇప్పటి వరకు వర్క్ ఫ్రం హోమ్ గురించి విన్నారు.. వర్క్ ఫ్రం ట్రాఫిక్ గురించి విన్నారా...? అయితే ఇదిగో ఈ వీడియోను చూసేయండి.. మీకే అర్థమౌతుంది. సిలికాన్ నగరంలో ఓ మహిళా ఉద్యోగి..
ఇప్పటి వరకు వర్క్ ఫ్రం హోమ్ గురించి విన్నారు.. వర్క్ ఫ్రం ట్రాఫిక్ గురించి విన్నారా...? అయితే ఇదిగో ఈ వీడియోను చూసేయండి.. మీకే అర్థమౌతుంది. సిలికాన్ నగరంలో ఓ మహిళా ఉద్యోగి..
Krishna Kowshik
మొన్నటి వరకు కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి కష్టాలు ఎదుర్కొన్నారు నగర వాసులు. గుక్కెడు నీటి కోసం తహతహలాడిపోయారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి.. వాటర్ ట్యాంకులు తెప్పించుకున్నారు ధనవంతులు. మధ్యతరగతి కుటుంబీకులు వాటర్ టిన్నులను తెచ్చుకుని గొంతు తడుపుకున్నారు. కొంత మంది ఇంట్లో స్నానాలు చేయకుండా.. షాపింగ్ మాల్స్‌లోకి వెళ్లి స్నానపానాదులు ఆచరించారు. ఇది తెలిసి కొన్ని షాపింగ్ మాల్స్ క్లోజ్ అయ్యాయి. ఉన్న నీళ్లతోనే ఒళ్లు తడుపుకుని ఆఫీసులకు వెళ్లారు. అయితే ఇప్పుడు ఆ నీటి కష్టాలు ముగిశాయి. కానీ నిత్యం ఈ మహా నగరాన్ని పట్టిపీడించే సమస్య మాత్రం ఒకటి ఉంది.. అదే ట్రాఫిక్. ఎన్ని సమస్యలు వచ్చిపోయినా ఈ సమస్య మాత్రం మారదు. ఇప్పుడు మరింత పీక్స్ కు చేరాయి.
నిత్యం ఇక్కడ ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు టెకీలు. తమ వాహనాలపై వెళుతూ.. గంటలు గంటలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతుంటారు. అప్పుడే ఆన్ లైన్ మీటింగ్ వస్తే ఇక అంతే సంగతులు. ఇప్పుడు అలాంటి కష్టమే ఎదుర్కొంది ఓ మహిళా టెకీకి. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఓ మహిళా టెకీ భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి ఉన్నాయి. అంతలో ఆమెకు ఆన్ లైన్ మీటింగ్ అండెంట్ కావాల్సిన పరిస్థితి. ఇక చేసేదీ ఏమీ లేక.. ఆ కాల్ అటెండ్ అయ్యింది. అటు ట్రాఫిక్ చూసుకుంటూ.. ఇటు వీడియో కాల్ చూస్తోంది. దీన్ని వీడియో తీసిన ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
‘వర్క్ ఫ్రం ట్రాఫిక్.. బెంగళూరులో ఓ సాధారణ రోజు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీన్ని చూసిన నెటిజన్లు సరదాగా వర్క్ ఫ్రం హోం అయిపోయింది.. ఇప్పుడు వర్క్ ఫ్రం ట్రాఫిక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ నగరంలో ట్రాఫిక్ సమస్యలు నగర వాసులకు కొత్తేమీ కాదు. ఇంటి నుండి బయలు దేరిన తర్వాత ఎప్పుడు గమ్య స్థానానికి చేరుకుంటారో వారికే తెలియదు. చిన్న పాటి దూరానికి కూడా గంటల సమయం తీసుకుంటుంది ఇక్కడ. ట్రాఫిక్ జామ్ నుండి తప్పించుకునేందుకు చాలా మంది మెట్రో, పబ్లిక్ ట్రాన్స్ ఫోర్టులను ఆశ్రయిస్తుంటారు. కానీ సొంత వాహనాలు కల్గిన వాళ్లు మాత్రం ఈ తిప్పలను ఎదుర్కొక తప్పడం లేదు.
சாலையிலும் வேலை
வேற என்ன பண்றதுஅது சரி
சிக்னல பாருங்கடாண்ணா
இவனுங்க எதுக்கு என்னையே பார்த்துக்கொண்டு இருக்கிறானுங்கள் pic.twitter.com/CiMo58flEQ— SHAAN SUNDAR 🖤♥️🖤♥️ (@Sun46982817Shan) April 23, 2024