iDreamPost

దేశభక్తి గీతానికి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన సైనికుడు! చేతిలో జెండాని విడవకుండా!

దేశ భక్తి పట్ల అతనికున్న ప్రేమ అజరామరం. త్రివర్ణ పతకాన్ని చేతబూని దేశ భక్తి గీతానికి డ్యాన్స్ చేస్తుండగా... ఒక్కసారిగా శరీరంలో ఏదో తేడా అనిపించింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు

దేశ భక్తి పట్ల అతనికున్న ప్రేమ అజరామరం. త్రివర్ణ పతకాన్ని చేతబూని దేశ భక్తి గీతానికి డ్యాన్స్ చేస్తుండగా... ఒక్కసారిగా శరీరంలో ఏదో తేడా అనిపించింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు

దేశభక్తి గీతానికి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన సైనికుడు! చేతిలో జెండాని విడవకుండా!

చిట్టి గుండె గట్టిగానే ప్రాణాలు తీసుకుంటుంది. చూస్తుండగానే కళ్ల ముందు నేల కూలిపోతున్నారు గుండెపోటు బాధితులు. పిడికెడంత గుండె ఎంత పనిచేస్తుందో.. చిన్న పెద్దా అనే తారతమ్యం లేకుండా రెప్ప పాటులో సజీవుల్ని.. విగత జీవులుగా మార్చేస్తుంది. ఇటీవల కాలంలో హార్ట్ ఎటాక్ కారణంగా అనేక మంది మృతి చెందిన సంగతి విదితమే. సినీ, రాజకీయ సెలబ్రిటీలతో పాటు ముక్కుపచ్చలారని పసికందులు సైతం దీనికి బాధితులయ్యారు. చూస్తుండగానే వీరంతా కుప్పకూలిపోయి తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లిపోయారు. తాజాగా ఓ రిటైర్డ్ సైనికుడ్ని కూడా బలితీసుకుంది ఈ మహామ్మారి. ఓ ఈవెంట్ చేస్తుండగా.. జాతీయ జెండాను చేత బూని డ్యాన్స్ చేస్తుండగా.. హార్ట్ స్ట్రోక్ రావడంతో నేలకొరిగాడు.

చనిపోతూ కూడా దేశం పట్ల ప్రేమ కనబర్చాడు ఈ సైనికుడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. ఇండోర్‌లో ఓ యోగా కార్యక్రమంలో పాల్గొన్నాడు ఈ రిటైర్డ్ సైనికుడు. చేతిలో జాతీయ జెండా పట్టుకుని దేశ భక్తి పాటలు ఆలపిస్తూ ఒక్కసారిగా కూలబడిపోయాడు. అయితే అక్కడ ఉన్న వీక్షకులు అదేదో స్క్రిప్టులో భాగం అనుకున్నారు తప్ప.. అతడికి గుండె పోటు వచ్చిందని గ్రహించలేకపోయారు. దీంతో అతడు చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. రిటైర్డ్ సైనికుడు బల్వీందర్ సింగ్ చభ్రా.. నగరంలోని పుతీ కోఠీ ప్రాంతంలోని అగ్రసేన్ ధామ్‌లో ఆస్తా యోగా క్రాంతి అభియాన్ అనే బృందం నిర్వహించిన ఉచిత యోగా శిబిరంలో పాల్గొన్నాడు.

అంతలో జాతీయ గీతాన్ని ప్లే చేస్తుండగా.. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపైకి జాతీయ జెండాను పట్టుకుని వచ్చాడు ఈ మాజీ ఆర్మీ జవాన్. ఆ పాటకు డ్యాన్స్ చేస్తుండగా.. అది చూస్తున్న ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. అంతలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా నేల కూలాడు. పడిపోతూ కూడా జెండాను విడువలేదు. చివరకు నేల కొరిగాక.. త్రివర్ణ పతకాన్ని వదిలేశాడు. అయితే అది చూస్తున్న వీక్షకులు చప్పట్లు కొడుతున్నారు తప్ప.. అతడికి ఏమైంది అని చూడటం లేదు. అంతలో పడిపోయిన జెండాను మరో వ్యక్తి తీసుకుని.. రెపరెపలాడించడం చేశాడు. అప్పటికే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చనిపోయాడు ఈ మాజీ ఆర్మీ ఉద్యోగి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తుంటే.. మనిషి ఎందుకింత కఠినాత్ముడిగా మారిపోయాడు అనిపించకమానదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి