Tirupathi Rao
Facts About Shampoo Ginger Lily: సాధారణంగా షాంపూ కావాలంటే అందరూ షాపులో కొనుక్కొచ్చుకుంటారు. కానీ, ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఎంత కావాలంటే అంత షాంపూని పిండుకుని వాడేసుకోవచ్చు.
Facts About Shampoo Ginger Lily: సాధారణంగా షాంపూ కావాలంటే అందరూ షాపులో కొనుక్కొచ్చుకుంటారు. కానీ, ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ఎంత కావాలంటే అంత షాంపూని పిండుకుని వాడేసుకోవచ్చు.
Tirupathi Rao
గతంలో అంటే తలస్నానం వారానికి ఒకసారి చేసేవాళ్లు. అది కూడా చక్కగా కుంకుడుకాయలను పగలగొట్టి వేడినీళ్లలో వేసి ఆ నీళ్లతోనే కుంకుడుకాయతో తలంటుస్నానం చేసేవాళ్లు. కుంకుడుకాయల వల్ల జుట్టు కూడా ఆరోగ్యకరంగా ఉండేది. ఇప్పుడు తలస్నానం చేయడం అందరికీ అలవాటుగా మారిపోయింది. పైగా బయట ఉన్న పొల్యూషన్ కి ప్రతిరోజు హెడ్ బాత్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇప్పుడు షాంపూ కొనుగోలు చేయడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. ఇలాంటి తరుణంలో ఒక మొక్క అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే ఆ మొక్కకు ఉండే పివ్వులను పిండితే షాంపూ వచ్చేస్తుంది.
మనం మాట్లాడుకునేది ఒక అద్భుతమైన మొక్క గురించి. దాని పేరు షాంపూ జింజర్ లిల్లీ అంటారు. దీని శాస్త్రీయనామం జింజిబర్ జెరంబెట్. సాధారణంగా ఏదైనా పువ్వును మీరు గట్టిగా పట్టుకుంటే నలిగి పోతుంది. రెబ్బలు కూడా నలిగి వాడిపోతాయి. కొన్ని గంటల్లోనే దాని సహజ సిద్ధమైన సౌందర్యాన్ని ఆ పువ్వు కోల్పోతుంది. ఏ పువ్వుకైనా ఇలాగే జరుగుతుంది. కానీ, ఈ షాంపూ జింజర్ మొక్కకు ఉండే పువ్వు మాత్రం చాలా ప్రత్యేకం. ఈ పువ్వును మీరు ఎంత పిండితే అంత వికసిస్తుంది. మీరు ఆ పువ్వుని పిండే కొద్ది దాని నుంచి ఒక జిగురు లాంటి ద్రవం వస్తూ ఉంటుంది. దానిని షాంపూ, క్లీన్సర్ గా వాడుతూ ఉంటారు.
దీనిని చూసిన తర్వాత ఏ దేశానికి చెందిందో అంటూ బుర్రలు బద్దలు కొట్టేసుకోకండి. ఈ షాంపూ జింజర్ లిల్లీ మనదేశంలోనే పుట్టింది. ఆ తర్వాత హవాయి దేశానికి వలస వెళ్లింది. ఈ మొక్క వేళ్లు అల్లం, పసుపు కొమ్ముల మాదిరిగానే ఉంటాయి. ఈ మొక్క పెరిగిన తర్వాత కాండం నుంచి జొన్నకంకి మాదిరిగా ఒక పువ్వు వస్తుంది. ఆ పువ్వు మొదట పచ్చగా ఉంటుంది. ఆ తర్వాత ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. ఆ పువ్వుకి అరలు అరలుగా రెబ్బలు ఉంటాయి. వాటి మధ్యలోనే ఈ ద్రవం ఉంటుంది. మీరు దీనిని మొగ్గగా ఉన్నప్పటి నుంచి పిండితే జిగురులాంటి ద్రవం వస్తుంది. దీనిని మీరు ఎంత నలిపినా కూడా వాడిపోదు. కానీ, పువ్వుని కాండం నుంచి కోసేస్తే మాత్రం ఆ ద్రవం రాదు. ప్రస్తుతం ఈ మొక్క నెట్టింటి తెగ వైరల్ అవుతోంది. దీనిని మీరు గదిలో ఫ్లవర్ వాజ్ లో కూడా పెంచుకోవచ్చు. ఈ ద్రవం మంచి సువాసన కూడా వస్తుంది.
ఈ షాంపూ జింజర్ లిల్లీ ద్రవాన్ని మీరు హెయిర్ కండిషనర్ గా, బాడీ క్లీన్జర్, మాయిశ్చరైజర్ లా కూడా వాడుకోవచ్చు. ఇప్పటికే ఈ మొక్క నుంచి వచ్చే ద్రవంతో పెర్ఫ్యూమ్ లు, షాంపూలు, బాడీ క్రీములను తయారు చేస్తున్నారు. ఈ మొక్కలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే. అందుకే దీని ద్రవంతో ఔషదాలు కూడా తయారు చేస్తున్నారు. డయేరియా, నులిపురుగుల సమస్యలకు ఈ మొక్క బాగా పని చేస్తుందని చెబుతున్నారు. ఇంకా అయిపోలేదు.. ఈ మొక్కను వంటకాల కోసం కూడా వాడతారు. ఆకులను ఏదైనా చుట్టి వండుకోవడానికి, కాండాన్ని తరిగి కూరల్లో వేసుకోవడానికి కూడా వాడతారు. ఈ మొక్కలు ప్రముఖ ఇ-కామర్స్ సైట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఎవరూ పెద్దగా కొనుగోలు చేయలేదు. ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే 5 పూల అంటులను రూ.500 విక్రయిస్తున్నారు. మరి.. ఈ షాంపూ జింజర్ లిల్లీని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.