Tirupathi Rao
Vamsee Krishna Reddy Future Business: మోటివేషనల్ స్పీకర్ వంశీకృష్ణా రెడ్డి త్వరలో తాను ప్రారంభించబోయే వ్యాపారం గురించి కీలక్ వ్యాఖ్యలు చేశాడు.
Vamsee Krishna Reddy Future Business: మోటివేషనల్ స్పీకర్ వంశీకృష్ణా రెడ్డి త్వరలో తాను ప్రారంభించబోయే వ్యాపారం గురించి కీలక్ వ్యాఖ్యలు చేశాడు.
Tirupathi Rao
మోటివేషనల్ స్పీకర్ వంశీకృష్ణా రెడ్డి గురించి నెటిజన్స్ కి అయితే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్యకాలంలో మోటివేషనల్ స్పీకర్ అనే కంటే కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వంశీకృష్ణా అంటే త్వరగా గుర్తు పడుతున్నారు. అతను రెండేళ్ల క్రితం నేత్రారెడ్డి అనే యువతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి వారధీ ఫామ్స్ అని స్థాపించి ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్లు. వీళ్లు సోషల్ మీడియాలో చాలా ఫేమస్ కూడా. అయితే వీళ్లు వ్యక్తిగత కారణాలతో ఇటీవలే విడిపోయారు. ఈ వార్త విన్న తర్వా వంశీ- నేత్రా అభిమానులు కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు. అయితే తిరిగి ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీగా మారిపోయారు. ఐడ్రీమ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీకృష్ణా రెడ్డి తన భవిష్యత్ ప్రణాళికలు, బిజినెస్ ఐడియాస్ గురించి షేర్ చేసుకున్నారు.
“వారధీ ఫామ్స్ లో ఉన్నప్పుడు నాకు ఆదాయం వచ్చేది. కానీ, గత 2 నెలలుగా నాకు ఎలాంటి ఆదాయం లేదు. నేను ప్రస్తుతానికి అన్న మీదే ఆధరపడి ఉంటున్నాను. నేను మళ్లీ నా లైఫ్ ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నా లైఫ్ ని 12త్ ఫెయిల్ సినిమాలో హీరోలా మళ్లీ రీస్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నిన్ననే ఒక థాట్ కూడా వచ్చింది. దానిని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాను. ఇది నాకు న్యూ బిగినింగ్ అనే చెప్పాలి. నేను మళ్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఈసారి సొంతంగా ప్రకృతి వ్యవసాయం చేయాలని అనుకుంటున్నాను. పేరు కూడా నిన్నే రిజిస్టర్ చేయించాను.
‘ఆర్గానిక్ యుగం’ అని పేరు పెట్టాను. కలియుగ్ ఫామ్స్ అని పెడదాం అనుకున్నాను కానీ, అది నెగిటివ్ అయ్యిద్దని మానేశాను. ఆర్గానిక్ యుగం అంటే అందరూ మళ్లీ తరిగి మంచి ఆహారం తినాలి, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని కోరుకుంటున్నాను. మళ్లీ ఫామింగ్ స్టార్ట్ చేసి.. షాప్ తీసుకుని ఈసారి ఇంకా పెద్దగా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను. ఎల్బీ నగర్ చుట్టుపక్కల ఫామ్ ల్యాండ్ తీసుకోవాలని చూస్తున్నాను. దీనివల్ల నేను బెనిఫిట్ కావడం మాత్రమే కాకుండా.. మరికొంత మందికి ఉపాధి లభిస్తుంది. ముందుగా స్పోర్ట్స్ షాప్ పెడదామని అనుకున్నాం. కానీ, నా మనసు మొత్తం ఆర్గానిక్ ఫామింగ్ మీదనే ఉంది. వేరే పని చేయాలి అంటే మనసు రావడం లేదు.
యూఆర్వీ స్పోర్ట్స్ అని స్టార్ట్ చేయాలని నేను అన్న అనుకున్నాం. కానీ, ప్రకృతి వ్యవసాయం వైపే నా మనసు లాగింది. కొన్నిరోజుల తర్వాత యూఆర్వీ స్పోర్ట్స్ గురించి ఆలోచిస్తాం. ఎక్కడికి వెళ్లినా నన్ను అందరూ ఆర్గానిక్ ఫామింగ్ గురించే అడుగుతారు. నేను స్పీచ్ ఇవ్వడానికి వెళ్లినా కూడా ఫామింగ్ గురించే అడుగుతారు. ఎక్కడికి వెళ్లినా ఫామింగ్ వీడియోల గురించే మాట్లాడుతూ ఉంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే నేను తిరిగి మళ్లీ ఫామింగ్ చేయాలి అనుకుంటున్నాను” అంటూ వంశీకష్ణా రెడ్డి తాను తిరిగి ఫామింగ్ స్టార్ట్ చేయబోతున్న విషయాన్ని ఐడ్రీమ్ మీడియాతో షేర్ చేసుకున్నాడు. మరి.. వంశీ తిరిగి వ్యవసాయం ప్రారంభించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.