iDreamPost
android-app
ios-app

వీడియో : మార్కెట్‌లోకి కల్తీ కోకా కోలా! రంగు నీళ్లతో అచ్చం ఒరిజినల్ డ్రింక్‌లా!

ఎండాకాలం వచ్చింది. ఉష్ణోగ్రతలు పెరిగాయి. బయటకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్నోళ్లకు కూడా దాహం వేస్తూ ఉంటుంది. వెంటనే ఫ్రిజ్ లో ఉన్న కూల్ డ్రింక్ తాగుదామని తీస్తున్నారా..? అయితే ఈ వీడియో చూడండి..

ఎండాకాలం వచ్చింది. ఉష్ణోగ్రతలు పెరిగాయి. బయటకే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్నోళ్లకు కూడా దాహం వేస్తూ ఉంటుంది. వెంటనే ఫ్రిజ్ లో ఉన్న కూల్ డ్రింక్ తాగుదామని తీస్తున్నారా..? అయితే ఈ వీడియో చూడండి..

వీడియో : మార్కెట్‌లోకి కల్తీ కోకా కోలా! రంగు నీళ్లతో అచ్చం ఒరిజినల్ డ్రింక్‌లా!

‘కాదేదీ కల్తీకి అనర్హం’ అన్నట్లుగా తయారయ్యింది నేడు మార్కెట్ ప్రపంచం. ప్రజల అవసరాలు, నమ్మకమే పెట్టుబడిగా ప్రతి పదార్థాన్ని కల్తీ చేసేస్తున్నారు కొందరు. ఏదీ అసలో, ఏదీ నకిలీనో తేల్చుకోలేనంతంగా ప్రొడక్ట్ తయారు చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారు. కేవలం డబ్బు కోసమే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పసి బిడ్డలకు వినియోగించే పాలు, దాని ఉత్పత్తులు, చాక్లెట్స్, చిరు తిండ్లు దగ్గర నుండి వంటల్లో వినియోగించే సుగంధ ద్రవ్యాలు, ఖరీదైన ఎలక్ట్రానిక్ గూడ్స్ వరకు మోసాలే. బ్రాండెడ్ కంపెనీ కూడా కనిపెట్టలేనంత.. ఆ కంపెనీ పేరుతోనే నకిలీ ఉత్పత్తులు మార్కెట్‌లోకి వచ్చేస్తున్నాయి. మన డబ్బులతో మన కళ్లను మనమే పొడుచుకునే స్థితికి తీసుకు వస్తున్నారు దొంగ వ్యాపారులు. తాజాగా అలాంటి ఓ బడా నకిలీ వ్యాపారం బయటకు వచ్చింది.

ఇప్పుడు వేసవి కాలం వచ్చేసింది. బయట ఎండలు మండిపోతున్నాయి. దాహం వేస్తుంది. వెంటనే నోరు తడి చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. చాలా మంది దప్పిక తీర్చుకోవడానికి ఇష్టంగా తాగే పానీయం కూల్ డ్రింక్. ఏ కోక్ లేదా పెప్సీ, థంబ్స్ అప్ లేదా సెవన్ అప్ ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బయట షాపుల నుండి తెచ్చుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుని దాహం వేసినప్పుడల్లా తాగుతుంటారు. సాధారణంగా కూల్ డ్రింక్ అంత హెల్దీ పానీయం కాదని తెలిసినప్పటికీ.. అప్పుడప్పుడు సేవిస్తూ ఉంటాం. అంతేనా ఎవరైనా అతిధులు వస్తుంటే.. వారికి కూడా ఇచ్చేస్తుంటారు. అయితే మీ ప్రాణాలే కాదూ.. వారిని ప్రాణాలను కూడా మీచేత్తోనే తీసేస్తున్నారు. అది ఎలా అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి.. మీకే తెలుస్తోంది.

ఇప్పటి వరకు మనం తాగుతున్న కూల్ డ్రింక్ కంపెనీ నుండి వస్తుందని భావిస్తుంటాం. కానీ కొంత మంది నకిలీగాళ్లు తమ వ్యాపారం కోసం ఇలాంటి నకిలీ ఉత్పత్తులు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రముఖ దిగ్గజ కంపెనీ కోకా కోలా లాంటి ఫేక్ ప్రొడక్ట్ తయారు చేసి అలాంటి బాటిల్స్, లేస్ తయారు చేసి ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే అర్థమౌతుంది.  రంగు నీళ్లతో నకిలీ కోక్ తయారు చేసి అసభ్య కరంగా చేతులతో ముంచి డబ్బాలో పోయడం, ఆ తర్వాత గ్యాస్ నింపడం, అదే కంపెనీ లేస్ అతికించడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూడకపోతే, అది రియల్ కోక్ అని ఎంత మంది తాగేస్తున్నామో కదా. ఈ వీడియోను కొంత మంది కోకా కోలాకు యజమాన్యానికి ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. కాగా, కొంత మంది ఇదేం మిక్సింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది యూజర్లు భారత్ ఫుడ్ సేఫ్టీ అథారిటీకి ఈ వీడియోను ట్యాగ్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి