iDreamPost
android-app
ios-app

వీడియో: కూతుళ్లు ఇచ్చిన గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్‌ అయిన నాన్న!

తమ కడుపున పుట్టిన బిడ్డల్ని ఉన్నత స్థితిలో చూడాలనుకుంటారు తల్లిదండ్రులు. అందుకే తాము పడుతున్న కష్టాన్ని వారికి తెలియకుండా పెంచుతుంటారు. వారి భవిష్యత్తు కోసం వీరు అహర్నిశలు కష్టపడుతుంటారు. పిల్లలు మంచి స్థాయికి వెళితే...

తమ కడుపున పుట్టిన బిడ్డల్ని ఉన్నత స్థితిలో చూడాలనుకుంటారు తల్లిదండ్రులు. అందుకే తాము పడుతున్న కష్టాన్ని వారికి తెలియకుండా పెంచుతుంటారు. వారి భవిష్యత్తు కోసం వీరు అహర్నిశలు కష్టపడుతుంటారు. పిల్లలు మంచి స్థాయికి వెళితే...

వీడియో: కూతుళ్లు ఇచ్చిన గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్‌ అయిన నాన్న!

పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడుతుంటారు. బిడ్డలకు బంగారు బాట వేయడానికి ఎన్నో త్యాగాలు చేస్తారు. వీరు కడుపు మాడ్చుకుని, వారి పొట్టలు నింపుతారు. పిల్లలు ప్రయోజకులైతే.. మురిసిపోతుంటారు. బిడ్డల విజయాన్ని వీరి గెలుపుగా భావిస్తారు. అలాంటి తల్లిదండ్రులకు పిల్లలు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేరు. అయితే ఈ కూతుళ్లు మాత్రం.. తన తండ్రి పడ్డ కష్టానికి ప్రతిఫలం అందించాలని ఆలోచన చేశారు. తాము సాధించిన విజయాన్ని నాన్న కళ్లల్లో చూడాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా.. తన తండ్రిని సర్ ప్రైజ్ చేసి.. ఆనందాన్ని అందించారు కూతుళ్లు. తమ తండ్రికి ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు అక్కా చెల్లెళ్లు.

వివరాల్లోకి వెళితే.. సోనాల్ సావంత్, తేజశ్రీ సావంత్ అక్కా చెల్లెళ్లు. వీరి తండ్రి కష్టాన్ని చూసి ఎదిగిన ఈ కుమార్తెలు.. తమ నాన్నకు ఏమివ్వగలమని అనుకున్నారు. ఏమిచ్చినా రుణం తీరదని భావించి.. సామాన్యుల ఇంటి కళ అయిన ఓ కారును తన తండ్రికి గిఫ్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. తల్లిదండ్రులతో కలిసి కారు షోరూమ్‌కు వెళ్లారు ఈ అమ్మాయిలు. షోరూములోకి వెళ్లి.. అన్ని కార్లు చూస్తున్నట్లుగా నటించి.. చివరకు నిస్సాన్ మాగ్నైట్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వాహనం వద్దకు చేరుకుంటారు. అంతలో ఓ వ్యక్తి వచ్చి కంగ్రాచ్యులేషన్స్ అంటూ ఆ కారు కీ అందిస్తారు. ఆ తండ్రి ఆశ్చర్యంతో అలా కూతురుని చూస్తూ ఉండిపోతాడు. ఇది మీకు మేమిస్తున్నా గిఫ్టు నాన్నా అంటారు.

కూతుర్లు ఇచ్చిన బహుమతితో పాటు సర్ ప్రైజ్ కు తండ్రి డైలామాలో ఉండిపోతారు. అంతలో కారు మీదేనని కుమార్తెలు, డీలర్ షిప్ ప్రతినిధి చెప్పగానే ఉబ్బితబ్బిబ్బు అయిపోతారు. అనంతరం తల్లిదండ్రులతో కలిసి అదే కారులో వెళ్లారు అక్కా చెల్లెలు. కాగా, తన తండ్రికి ఇచ్చిన గిఫ్టు గురించి సోనాల్ సావంత్.. సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మా అమ్మ మాకు జన్మనిస్తే.. మా నాన్న నా కలల సాకారం చేసుకునేందుకు కృషి చేశారు. ఆయనకు ధన్యవాదాలు. నేను ఇంత ఉన్నత స్థాయికి చేరుకోగలిగాను అంటే అందుకు కారణం నాన్న. మీరు మా కోసం చేసిన త్యాగాలకు ఓ చిన్న రిటర్న్ గిప్ట్‘ అంటూ పేర్కొంది. ఇక ఈ ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేవు. ఈ కారులో ఉన్న నంబర్ ప్లేట్ ఆధారంగా వీరు మహారాష్ట్ర వాసులని తెలుస్తోంది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు. గ్రేట్ డాటర్స్ అని, తండ్రికి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఇదని పేర్కొంటున్నారు. మరీ తండ్రి పట్ల ఈ కూతుర్లు చూపించిన ప్రేమపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by sonalsawat (@sonalsawat24)

Jojobet GirişjojobetcasibomjojobetcasibombetsmovemariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel giriş