iDreamPost
android-app
ios-app

Ayodhya Rama Mandir: అయోధ్య రామ మందిరానికి.. రివ్యూవర్ ఆదిరెడ్డి రూ.లక్ష విరాళం!

అయోధ్య రామ మందిరానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. ఆ జాబితాలోకి రివ్యూవర్ ఆదిరెడ్డి కూడా చేరాడు.

అయోధ్య రామ మందిరానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. ఆ జాబితాలోకి రివ్యూవర్ ఆదిరెడ్డి కూడా చేరాడు.

Ayodhya Rama Mandir: అయోధ్య రామ మందిరానికి.. రివ్యూవర్ ఆదిరెడ్డి రూ.లక్ష విరాళం!

ప్రపంచం మొత్తం నివ్వెరపోయే విధంగా అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 22 కోసం కేవలం భారతీయులు మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముడి భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ రామయ్యపై ఉన్న తమ భక్తిని ఇప్పటికే పలు విధాలుగా తెలియజేస్తున్నారు కూడా. అందులో రామ మందిరానికి విరాళాలు ఇవ్వడం కూడా ఒకటి. ఇప్పటికే కోట్ల మంది భక్తులు అయోధ్య రామ మందిర నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు విరాళాల రూపంలో అందజేశారు. ఇప్పుడు ఆ జాబితాలోకి బిగ్ బాస్ కంటెస్టెంట్, బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి కూడా చేరాడు.

ఆదిరెడ్డి అలియాస్ ఉడాల్ మామ గురించి బిగ్ బాస్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా.. నెటిజన్స్ కి కూడా బాగా తెలిసే ఉంటుంది. బిగ్ బాస్ షో మీద రివ్యూలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. అతను చెప్పే రివ్యూలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేవి. వాటికి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చేది. అలా రివ్యూస్ చెప్తూనే ఆదిరెడ్డి కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ లోకి వెళ్లాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లిన ఆదిరెడ్డి.. అద్భుతమైన ఆటతీరుతో మరింత ఫేమస్ అయిపోయాడు. తర్వాత తాజాగా వచ్చిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్ గా తన అభిప్రాయాలను చెబుతూ ఆర్థికంగా కూడా బాగానే సెటిల్ అయ్యాడు. ఓన్ గా వ్యాపారం కూడా ప్రారంభించాడు. అయితే ఇదంతా తన కష్టంతోనే వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఆ క్రెడిట్ ని మాత్రం ఎప్పుడూ ప్రేక్షకులు, అభిమానులకే ఇస్తూ ఉంటాడు.

తన ఫ్యాన్స్, ఫ్యామిలీ, ఫాలోవర్స్ తరఫున రివ్యూవర్ ఆదిరెడ్డి ఒక గొప్ప పని చేశాడు. అయోధ్య రామ మందిరానికి తన ఫాలోవర్స్, ఫ్యామిలీ తరఫున లక్ష రూపాయలు విరాళంగా అందజేశాడు. ఆ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడించాడు. “మన సబ్ స్క్రైబర్స్, మన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ బాగుండాలని, నేను కొత్తగా స్టార్ట్ చేసిన సెలూన్ బాగుండాలని, నా భార్య, నా కూతురు, నా కుటుంబం బాగుండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ.. మన రామ మందిరానికి నా వంతుగా రూ.లక్ష డొనేట్ చేశాను. మన అందరి కల, హిందువుల కల అయిన రామ మందిరానికి మీరు కూడా మీ వంతుగా డొనేట్ చేయండి” అంటూ ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు.

విరాళాలు ఎంతొచ్చాయంటే?:

అయోధ్య రామ మందిర నిర్మాణానికి రామ మందిర నిర్మాణ ట్రస్టు రూ.900 కోట్లు విరాళాలుగా సేకరించాలని సంకల్పించారు. అందుకోసం 11 కోట్ల మంది ప్రజల నుంచి ఈ విరాలాలు సేకరణ చేయాలని బావించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివారల ప్రకారం.. ఎవరూ ఊహించని విధంగా 2023 డిసెంబర్ నాటికి రామ మందిరానికి రూ.3,200 కోట్లకు పైగా విరాళాలు అందాయి. 18 కోట్ల మంది రామ భక్తులు బ్యాంకు ఖాతాల్లో రూ.3,200 కోట్లకు పైగా విరాళాల రూపంలో జమ చేశారు. ఈ మొత్తాన్ని ఆలయ ట్రస్టు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. ఆ మొత్తం మీద వచ్చే వడ్డీతోనే రామ మందిరం నిర్మాణం చేస్తున్నారు. విరాళాల్లో అత్యధికంగా ఆధ్యాత్మిక గురువు, కథకులు మొరారి బాపు రూ.11.3 కోట్లు విరాళంగా అందజేశారు. అంతేకాకుండా ఆయన అనుచరులు అమెరికా, యూకే దేశాల నుంచి రూ.8 కోట్ల వరకు విరాళాలు సమకూర్చారు. ఇలా రామ మందిరానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తుల నుంచి వేల కోట్ల రూపాయల విరాళాలు అందుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Adi Reddy (@adireddyofficial)