iDreamPost
android-app
ios-app

వీడియో: ప్రాణం పోసే వైద్య వృత్తిలో ఉండి.. ఇదేం పాడు పని

సాధారణంగా చేతులు జోడించి మొక్కేది దేవుడికి, ఆ తర్వాత వైద్యుడికి. ఎంతో మందికి ప్రాణం పోసే డాక్టరే.. చెత్త పనులు చేస్తూ వార్తల్లో నిలిచాడు. దీంతో ఉతికి ఆరేశారు కొందరు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

సాధారణంగా చేతులు జోడించి మొక్కేది దేవుడికి, ఆ తర్వాత వైద్యుడికి. ఎంతో మందికి ప్రాణం పోసే డాక్టరే.. చెత్త పనులు చేస్తూ వార్తల్లో నిలిచాడు. దీంతో ఉతికి ఆరేశారు కొందరు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

వీడియో:  ప్రాణం పోసే వైద్య వృత్తిలో ఉండి.. ఇదేం పాడు పని

మహిళలు, చిన్నారులపై సామూహిక అత్యాచారాలు, లైంగిక దోపిడీకి పాల్పడే నేరస్థులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది కేంద్ర ప్రభుత్వం. నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టాలను తీసుకు వచ్చింది. కానీ అఘాయిత్యాలు ఆగడం లేదు. ఓ వైపు కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు దేశాన్ని కుదిపేస్తున్న వేళ.. మాలీవుడ్‌లో హేమ కమిటీ ఇచ్చిన నివేదిక సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. నిత్యం ఏదో ఒక చోట లైంగిక వేధింపులకు బలౌతూనే ఉన్నారు యువతులు, మహిళలు. ఇంట్లో, బయట, పని ప్రదేశాల్లో సెక్సువల్ హెర్రాస్ మెంట్‌కు గురౌతున్నారు. ఎంతో మందికి ప్రాణ పోసే వైద్యుడు.. తన వద్ద పనిచేస్తున్న మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అతడికి బుద్ది చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

కొన్ని వార్త ఛానల్స్ కథనాల ప్రకారం.. తన క్లినిక్‌లో పనిచేస్తున్న మహిళపై ఓ వైద్యుడు మిస్ బిహేవ్ చేయడంతో.. ఆమె ఇంటికి వెళ్లి విషయం కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో ఆగ్రహించిన కుటంబ సభ్యులు.. అతడి వద్దకు వెళ్లి చెంపలు పగులగొట్టారు. ఆయన చూసేందుకు చాలా పెద్దవాడిగా కనిపిస్తున్నాడు. ఈ వయస్సులో పాడు బుద్ది చూపిస్తూ.. తన పైత్యాన్ని ప్రదర్శించాడు. దీంతో అతడికి బుద్ది చెప్పారు ఆమె ఫ్యామిలీ మెంబర్స్. అతను వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. బాధితురాలు కుటుంబ సభ్యులు దాడి చేశారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది తెలియరాలేదు.

ఇక నెటిజన్లు తమ చేతులతో పనిచెప్పారు. పలు రకాల కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. కొంత మంది బాధితురాలికి మద్దతుగా మాట్లాడుతుంటే.. మరికొంత మంది డాక్టరుపై దాడిని ఖండిస్తున్నారు. ‘నేను ఎవరినీ విమర్శిచడం లేదు. ఇటువంటి ఘటనలు ఎదురైనప్పుడు ముందుగా పోలీసులకు సమాచారం అందించాలి. అమ్మాయిలు కూడా తమ స్వలాభం కోసం లేదా వ్యక్తిగత ద్వేషంతో ఇలాంటి లైంగిక ఆరోపణలు చేస్తుంటారు’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘గుడ్ జాబ్ లేడీ, పోలీసులు, కోర్టు వేగంగా చర్యలు తీసుకోలేవు’ అని మరో సోషల్ సైనికుడు వ్యాఖ్యానించారు. ఏదేమైనా వైద్య వృత్తిలో ఉండి ఇలా చేయడం సరికాదూ అంటున్నారు సోషల్ మీడియా శ్రామికులు.