SNP
TS Election Results 2023, Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండు సార్లు గెలిచిన బీఆర్‌ఎస్‌ను ఓడించి.. కాంగ్రెస్ అధికారం రావడం వెనుక.. 19 ఏళ్ల క్రితం వైఎస్సార్ చూపించిన బాటే కారణం అయింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
TS Election Results 2023, Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండు సార్లు గెలిచిన బీఆర్‌ఎస్‌ను ఓడించి.. కాంగ్రెస్ అధికారం రావడం వెనుక.. 19 ఏళ్ల క్రితం వైఎస్సార్ చూపించిన బాటే కారణం అయింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ను ఓడిస్తూ.. తెలంగాణను హస్తగతం చేసుకుంది. మొత్తం 64 సీట్లు సాధించిన కాంగ్రెస్.. తెలంగాణలో అధికారం చేపట్ట బోతున్న రెండో పార్టీగా నిలవనుంది. అయితే.. కాంగ్రెస్ విజయం సాధించాడానికి అనేక కారణాలు ఉన్నా.. ఆ పార్టీలోని ముఖ్య నేత భట్టీ విక్రమార్క గురించి మాట్లాడుకోవాలి. పదేళ్లుగా పార్టీ అధికారంలో లేకపోయినా.. రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరున్నా.. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉండటమే కాదు.. పార్టీని తన భుజాలపై వేసుకుని.. శాసన సభా పక్ష నేతగా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిత్యం ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ వచ్చారు. వీటన్నింటి కంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. భట్టీ చేపట్టిన పాదయాత్ర గురించి.
మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం పిప్ర నుంచి పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర మొదలు పెట్టి.. 108 రోజుల పాటు నిర్విరామంగా నడిచి.. ఖమ్మం జిల్లా వరకు పాదయాత్ర చేశారు. జూలై 1న పాదయాత్ర ముగించి.. జూలై 2న పాద్రయాత్ర విజయవంతం సందర్భంగా, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్న సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ పాదయాత్రతో నిద్రావస్థలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులను భట్టీ తట్టి లేపారనే చెప్పాలి. 2004లో అప్పటి కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. చేసిన పాదయాత్రను గుర్తు చేస్తూ.. భట్టీ పాదయాత్ర సాగింది. పాదయాత్ర అంటే అందరికి గుర్తుకు వచ్చే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. కరుడుగట్టిన కాంగ్రెస్ వాది ఆయన.
2004లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి.. 2004లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత అద్భుతమైన పాలన అందించి.. 2009లో కూడా పార్టీని ఒంటిచేత్తో గెలిపించారు వైఎస్సార్. కాంగ్రెస్‌కు పాదయాత్రలో అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్సార్‌ను స్ఫూర్తిగా తీసుకుని.. భట్టీ విక్రమార్క సైతం అదే పాదయాత్రతో ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. పాదయాత్రతో పాటు.. ఖమ్మం జిల్లాపై పట్టున్న నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు సైతం భట్టీ ఎంతో కృషి చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చారు. అలాగే.. సీపీఐతో పొత్తు విషయంలో కూడా భట్టీ పాత్ర కీలకం. ఇలా కాంగ్రెస్ విజయం కోసం తన శక్తికి మించి కష్టపడిన వ్యక్తి భట్టి విక్రమార్క. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. పార్టీకి ఇంతలా కష్టపడ్డ ఆయనకు సీఎం పదవి వరిస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి కాంగ్రెస్‌కు అధికారంలోకి తెచ్చేందుకు భట్టీ పడిన కష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.