iDreamPost

ఘోరం.. చెల్లి భవిష్యత్ బాగుండాలని.. అసలు ఏం జరిగిందంటే?

వరంగల్ లో ఘోరం జరిగింది. చెల్లి భవిష్యత్ బాగుండాలని కోరుకున్న అక్కకు తీరని అన్యాయం జరిగింది. ఊహించని ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వరంగల్ లో ఘోరం జరిగింది. చెల్లి భవిష్యత్ బాగుండాలని కోరుకున్న అక్కకు తీరని అన్యాయం జరిగింది. ఊహించని ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఘోరం.. చెల్లి భవిష్యత్ బాగుండాలని.. అసలు ఏం జరిగిందంటే?

ఆపద ఎప్పుడు ఎలా ముంచుకొస్తదో చెప్పలేము. అంతా బాగుందనేలోపే ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు తీరని విషాదాన్ని నింపుతాయి. ఇటీవల రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అప్పటి వరకు తమతో ఉన్న వారు ప్రమాదాల భారిన పడి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, ఓవర్ స్పీడు వంటి కారణాలతో వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తన చెల్లి భవిష్యత్ కోసం వెళ్లిన అక్కకు ఘోర ప్రమాదం జరిగింది. చెల్లిని పరీక్ష రాయించేందుకు తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో అక్క మృతి చెందింది.

వరంగల్‌ జిల్లా కరీమాబాద్‌ ప్రాంతానికి చెందిన నాగపురి కాళి-సంధ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు నాగపురి తన్మయ్‌(23), చిన్న కూతురు సాయిహర్షిత. అయితే సాయిహర్షిత ఎప్ సెట్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమెను పరీక్ష రాయించేందుకు హైదరాబాద్ కు తీసుకెళ్లడానికి తల్లి, తన అక్క తన్మయ్‌ సిద్ధమయ్యారు. వీరు ముగ్గురు కలిసి శనివారం హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. ఇదే సమయంలో విధి వారిని వెంటాడింది. హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో ఘటో కేసర్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వారి కారును డీసీఎం ఢీకొట్టడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నాగపురి తన్మయ్ అక్కడికక్కడే మృతిచెందింది.

మిగతా ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చెల్లి పరీక్ష కోసం అక్క వెళ్లి విధి పెట్టిన పరీక్షలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన్మయ్‌ మృతితో కరీమాబాద్‌లో విషాదం నెలకొన్నది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ను పాటించి సురక్షిత ప్రయాణాలు చేయాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలతో ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని వారు సూచించారు. మరి చెల్లి పరీక్ష కోసం వెళ్లిన అక్క రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి