P Venkatesh
Young man who got 5 government jobs : ఓ యువకుడు పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కింది. టీ అమ్ముకుంటూ ఏకంగా 6 నెలల్లోనే 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు. అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
Young man who got 5 government jobs : ఓ యువకుడు పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కింది. టీ అమ్ముకుంటూ ఏకంగా 6 నెలల్లోనే 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు. అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
P Venkatesh
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని యువత కలలుకంటుంటారు. ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపరేషన్ సాగిస్తుంటారు. నిద్రాహారాలు మాని పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టరు. తమను తాము పోషించుకునేందుకు పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాలకు అండగా ఉంటూ కష్టపడి చదువుతున్నారు. డెలివరీ బాయ్స్, సెక్యూరిటీ గార్డ్స్, గృహిణులు ఇలా చాలా మంది కుటుంబాల కోసం కష్టపడుతూ ఖాళీ టైమ్ లో చదువుకుంటూ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన కాంపిటీషన్ ఉంది.
అయినప్పటికీ అసాధారణ ప్రతిభకనబరుస్తూ ఇటీవల పలువురు యువతీ యువకులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలను సాధించి అదరగొడుతున్నారు. ఒక్క ఉద్యోగమే సాధించడం కష్టంగా మారిన తరుణంలో 3, 4 జాబ్స్ ను సాధిస్తున్నారు. మట్టిలో మాణిక్యాల ప్రతిభకు తగిన ఫలితం దక్కుతోంది. ప్రభుత్వ కొలువులను సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు ప్రభుత్వ పోటీపరీక్షల్లో మెరిశాడు. యువకుడి కష్టానికి తగిన ఫలితం దక్కింది. పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన మహేష్ కుమార్ 6 నెలల్లో 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తా చాటాడు. మొక్కవోని దీక్షతో తన లక్ష్యాన్ని ఛేదించాడు.
ఈ సక్సెస్ అందుకోవడానికి అతడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో మహేష్ కుమార్ టీ అమ్మాడు. ఆ తర్వాత స్నేహితుల సాయంతో విజయనగరం వెళ్లి కోచింగ్ తీసుకున్నాడు. రేయింభవళ్లు కష్టపడి చదివాడు. ప్రభుత్వ కొలువు సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అయినట్లు అతను వెల్లడించాడు. ప్రభుత్వం నిర్వహించిన పోటీపరీక్షలకు హాజరయ్యాడు. ఈ ఏడాది గురుకుల టీజీటీ, పీజీటీలో స్టేట్ 9వ, గురుకుల జూనియర్ లెక్చరర్ 4వ, టీజీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ 2వ, డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ పెద్దపల్లి జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు ఆయన తెలిపారు.
టీ అమ్ముతూ 6 నెలల్లోనే 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందనే వ్యాఖ్యలను నిజం చేసి చూపించాడు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మహేష్ కుమార్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒక్క ఉద్యోగం సాధించడమే గగనమైపోతున్న సమయంలో 5 జాబ్స్ సాధించిన మహేష్ కుమార్ ను పలువురు అభినందిస్తున్నారు. మరి 6 నెలల్లోనే 5 ఉద్యోగాలు సాధించిన మహేష్ కుమార్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.