iDreamPost
android-app
ios-app

పోలీస్ స్టేషన్ ముందు రీల్ చేసిన యువకుడు! చివరకి..

కాలక్షేపం కోసమో.. వినోదం కోసమో చేయాల్సిన రీల్స్, షార్ట్ వీడియోలు ఇప్పుడు యువకులను జైలు పాలు చేస్తున్నాయి. మరికొన్ని ప్రాణాల మీదికి తెస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

కాలక్షేపం కోసమో.. వినోదం కోసమో చేయాల్సిన రీల్స్, షార్ట్ వీడియోలు ఇప్పుడు యువకులను జైలు పాలు చేస్తున్నాయి. మరికొన్ని ప్రాణాల మీదికి తెస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

పోలీస్ స్టేషన్ ముందు రీల్ చేసిన యువకుడు! చివరకి..

ఎలాగైనా ఎదో ఒకటి చేసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. ముఖ్యంగా కొందరు యువత ఈ విషయంలో వారి హద్దులు దాటుతున్నారని చెప్పాలి.  తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కదులుతున్న రైలు, బస్ మీద, లేదా రద్దీగా ఉన్న ట్రాఫిక్ లో.. ఇలా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తున్నారు. అంతేకాక ఆ వీడియోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి లైకుల కోసం తెగ ఆరాటపడుతుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి కంటే.. ఇలా యువతను తప్పు ద్రోవ పట్టించే వీడియోలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా అలానే ఓ యువకుడు ఏకంగా పోలీస్ స్టేషన్ ముందు రీల్ చేశాడు. చివరకు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని పొందాడు. మరి.. ఆ  వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

తెలంగాణలోని సికింద్రాబాద్ ప్రాంతంలోని రాంగోపాలపేట్ పోలీస్ స్టేషన్ ముందు వంశీకృష్ణ అనే యువకుడు ఓవర్ యాక్షన్ చేశాడు. పోలీస్ స్టేషన్ ముందే గంజాయి తాగుతూ రచ్చ చేశాడు. అంతేకాక ఓ ర్యాప్ సాంగ్ కు రీల్ చేశాడు. అలా చేసినోడు ఊరికేనే ఉండక.. ఆ రీల్ ను ఇన్ స్ట్రాగ్రాంలో పెట్టాడు. దీంతో అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇన్ స్టాగ్రాంలో వంశీకృష్ణ పోస్టును చూసిన పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఆ పోస్టును ట్విట్టర్ లో సీఎం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు వంశీ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

reel in front of police station

అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపర్చిచారు. ఇక న్యాయమూర్తి వంశీకృష్ణకు ఎనిమిది రోజుల జైలు శిక్షను విధించారు. అయితే పోలీసుల వంశీ కృష్ణ లాగా మరేవరు చేయకుండా ఓ వినూత్నంగా ఆలోచనకు తెరలేపారు. వంశీకృష్ణకు సంబంధించిన రెండు వీడియోలను పోలీసులు సోషల్ మీడియా లో పోస్టు పెట్టారు. పోలీసులు  వంశీని కేవలం అరెస్ట్ చేయటంతో పాటు రీల్ వర్సెస్ జైలు అనే పేరుతో.. పాత వీడియోతో పాటు యువకుడ్ని చంచల్ గూడ్ జైలుకు పంపించే వీడియోను కూడా కలిపి రీల్ క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి అతిపనులు చేస్తే, జైలుకు వెళ్లటం పక్కా అన్న హెచ్చరికను ఈ వీడియో ద్వారా యువతకు పోలీసులు జారీ చేశారు. మరి.. ఈ రీల్ వర్సెస్ రీయల్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.