Arjun Suravaram
క్రికెట్ లో ఒకే ఓవర్ లో ఆరు బాల్స్ కి ఆరు సిక్సర్లు కొట్టిన యువరాజ్ సింగ్ ని చూశాం. అలానే ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిన యువతి అందరికి స్ఫూర్తిగా నిలిచింది. మరి.. ఆమె సక్సెస్ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
క్రికెట్ లో ఒకే ఓవర్ లో ఆరు బాల్స్ కి ఆరు సిక్సర్లు కొట్టిన యువరాజ్ సింగ్ ని చూశాం. అలానే ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిన యువతి అందరికి స్ఫూర్తిగా నిలిచింది. మరి.. ఆమె సక్సెస్ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Arjun Suravaram
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం రావడమే గగనం. అలాంటిది ఎవరైన రెండు ఉద్యోగాలు సాధిస్తే..వారిని గొప్పగా చూస్తారు. అదే ఏకంగా ఐదు ఉద్యోగాలు పొందిన వారిని ఇక సమాజం ఏ విధంగా చూస్తుందో అర్థం చేసుకోవచ్చు. అలా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించిన వారిని ఈ లోకం గొప్పగా చూస్తుంది. ఇలాంటి ప్రతిభ వంతులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలానే తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువతి ఒకేసారి ఐదు ప్రభుత్వ జాబ్స్ ను పొంది.. అందరిన ఔరా అనిపించింది. మరి.. ఆ సక్సెస్ ఉన్న వెనుక కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
క్రికెట్ లో ఒకే ఓవర్ లో ఆరు బాల్స్ కి ఆరు సిక్సర్లు కొట్టిన యువరాజ్ సింగ్ ని చూశాం. అలానే ఏదైనా పోటీ పరీక్షల ఫలితాల్లో వరుసగా ర్యాంకులు సాధించిన కార్పొరేట్ విద్యాసంస్థలను చూశాం. కానీ రాసిన ప్రతి ప్రభుత్వ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఓ యువతి ఏకంగా ఐదు ఉద్యోగాలను సాధించింది. అంతేకాక తన విజయంతో ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలిచింది.
జగిత్యాల మండలంలోని ల్యాగలమర్రి గ్రామానికి చెందిన పుప్పాల భూమయ్య, రమ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు మమత అనే కుమార్తె ఉంది. ఆ యువతికి చిన్నతనం నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరిక బలంగా ఉండేది. అంతేకాక కుటుంబ పరిస్థితి చూసి..తాను కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం పొంది..ఆర్థిక భరోసా ఇవ్వాలని భావించింది. అలా ఆర్థిక భరోసాతో పాటు సమాజ సేవ చేయాలని ధృడంగా నిర్ణయించుకుంది.
ఈక్రమంలోనే కష్టపడి చదువుతూ.. మమత బీఈడీ, ఎంకామ్ పూర్తి చేసింది. అనంతరం సిరిసిల్ల లోని గురుకుల డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో అతిథి అధ్యపకురాలిగా విధులు నిర్వర్తిస్తూ వివిధ ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే గతంలోఆమె గురుకుల నియామక పరీక్షలో కామర్స్ విభాగంలో డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, సోషల్ విభాగంలో పీజీటీ, టీజీటీ జాబ్ లను పొందారు. వీటితో పాటు గతేడాది టీఎస్పీఎస్సీ నిర్వహించిన మున్సిపల్ శాఖ విభాగంలోని పరీక్షల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. అయితే డిగ్రీ లెక్చరర్ గా చే రి విద్యార్థులకు సేవలందిస్తాని మమత తెలిపారు. మొత్తంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి మమత సత్తా చాటింది.
ఉన్నత స్థాయిలో తమ కూతురు నిలవాలి అనుకున్నమమత తల్లిదండ్రుల సంతోషంలో మునిగితేలారు. ఇలా మమత ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించడం తో ఆమె తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓకే ఉద్యోగం సాధించడం గగనం అవుతున్న తరుణంలో రాసిన అన్నిటిలో సత్తా చాటి ఐదు సర్కారీ కొలువులను సాధించిన మమతను నేటితరం యువత స్ఫూర్తిగా నిలిచారు. ఇక ఐదు ఉద్యోగాలతో సత్తా చాటిన మమతను స్థానికులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు అభినందించారు. మరి.. సర్కారీ కొలువుల్లో ప్రతిభ చాటిన ఈ యువతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.