iDreamPost
android-app
ios-app

మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించినా చలానా పడిందా?.. ఇలా చేస్తే రూపాయి కట్టాల్సిన పని లేదు!

ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించినప్పుడు చలాన్ విదిస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. మరి మీ తప్పు లేకున్నా చలానా పడితే ఏం చేయాలి? ఇలా చేసి ఆ చలానాను క్యాన్సిల్ చేసుకోవచ్చు.

ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించినప్పుడు చలాన్ విదిస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. మరి మీ తప్పు లేకున్నా చలానా పడితే ఏం చేయాలి? ఇలా చేసి ఆ చలానాను క్యాన్సిల్ చేసుకోవచ్చు.

మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించినా చలానా పడిందా?.. ఇలా చేస్తే రూపాయి కట్టాల్సిన పని లేదు!

రోడ్డు ప్రమాదాల నివారణకు.. సురక్షితమైన ప్రయాణాలకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ను ప్రవేశపెడుతుంటారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు చలాన్లను విదిస్తుంటారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, అధిక వేగం, సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ వంటి వాటికి వాహనదారులు పాల్పడినప్పుడు చలాన్లు పడుతుంటాయి. ట్రాఫిక్ పోలీసులు తనఖీలు చేపట్టినప్పుడు పట్టుబడితే ఆ చలానాలు కట్టక తప్పదు. మరి ఒక వేళ మీరు అన్ని రూల్స్ పాటించి.. మీ తప్పు లేకపోయినా అప్పుడప్పుడు చలానాలు పడుతుంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? టెన్షన్ పడాల్సిన పని లేదు. పొరపాటున పడిన చలాన్లను ఇలా చేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎలా అంటే?

ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణం చేస్తున్న వారిని కెమెరాలతో క్లిక్ మనిపించి నేరుగా బాధితుడికి పంపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ చలానాలను మీ సేవా సెంటర్లు, ఈ- చలాన్ వెబ్ సైట్ ల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సార్లు మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పటికీ చాలాన్లు వస్తుంటాయి. ఎందుకంటే.. వెహికిల్ నెంబర్స్ సరిగా కనిపించనప్పుడు ఒకరికి పడే చలాన్ మరొకరికి పడుతుంది. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియదు. ఎరినీ సంప్రదించాలో అర్ధం కాదు. ఇక చేసేదేం లేక ఆ చలానాను వారే చెల్లిస్తుంటారు. కానీ ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టొచ్చు. మీ తప్పు లేకున్నా పడిన చలానాను క్యాన్సిల్ చేసుకోవచ్చు. చలానా పడిన వాహనం మీది కాదని తెలిసిన వెంటనే క్యాన్సిల్ చేసుకునే సౌలభ్యం ఉంది.

Did it happen through no fault of yours

అయితే పొరపాటున పడిన చలానాను క్యాన్సిల్ చేసుకోవాలంటే.. చలానా పడిన 15 రోజుల్లో క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ఆన్ లైన్ లో టిఎస్ ఈ చలాన్ వెబ్‌సైట్‌లో చలాన్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. పొరపాటున చలానా పడిందని గుర్తిస్తే వెంటనే మీ సేవా సెంటర్ కు వెళ్లి తప్పుడు చలానాను క్యాన్సిల్ చేసుకోవచ్చు. చలానాలో వెహికిల్ నెంబర్ తో పాటు ప్రయాణించిన అడ్రస్ ఉంటుంది. దీని సాయంతో ఆ బండి మీది కాదని నేరుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి క్యాన్సిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీరు రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు.