KCR హెల్త్ అప్ డేట్.. సర్జరీ చేయనున్న కోరుట్ల MLA

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా ఆయనకు యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం శస్త్ర చికిత్స చేయనున్నారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా ఆయనకు యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం శస్త్ర చికిత్స చేయనున్నారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రమాదానికి గురయ్యారు. ఎర్రవెల్లిలోని తన ఫాం హౌజ్ లో ఉంటున్న కేసీఆర్ గురువారం రాత్రి 2 గంటల సమయంలో కిందపడినట్లు సమాచారం. బాత్రూంకు వెళ్లేక్రమంలో ఆయన కాలుజారి కింద పడ్డారని తెలుస్తోంది. అయితే కేసీఆర్ ప్రమాదానికి గురైన వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్య బ‌ృందం కేసీఆర్ కు ఎముకు విరిగినట్లు నిర్థారించారు. ఈ క్రమంలోనే ఆయనకు సర్జరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సర్జరీని కోరుట్ల ఎమ్మెల్యే చేయడం గమనార్హం.

మాజీ సీఎం కేసీఆర్ కు ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు శస్త్ర చికిత్స నిర్వహించనున్నట్లు వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ కు హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సర్జరీని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ చేయనున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా డాక్టర్ సంజయ్ ఆర్థోపెడీషియన్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక కేసీఆర్ ఆరోగ్యంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని యశోద వైద్యులు వెల్లడించారు.

ఇక తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలుపొంది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ తన ఫామ్ హౌజ్ వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను, ప్రజలను వ్యవసాయ క్షేత్రంలోనే కలుస్తున్నారు. కాగా గురువారం రాత్రి ఆయన ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. దీంతో ఆయనకు ఎడమ తుంటికి ఫ్యాక్చర్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సర్జరీ జరుగనున్నది. ఇక కేసీఆర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిన బీఆర్ఎస్ శ్రేణులు, పీఎం మోడీ, ఇతర రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Show comments