Yadadri: యాదాద్రి భక్తులకు అలర్ట్‌.. ఆలయంలో కొత్త రూల్‌.. అలా చేస్తే నో దర్శనం

యాదాద్రి వెళ్లే భక్తులు ఆలయ అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. ఇక మీదట అలా చేస్తే.. దర్శనానికి అనుమతించము అన్నారు. ఆ వివరాలు..

యాదాద్రి వెళ్లే భక్తులు ఆలయ అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. ఇక మీదట అలా చేస్తే.. దర్శనానికి అనుమతించము అన్నారు. ఆ వివరాలు..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. యాదగిరి గుట్ట ఆలయం రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి యాదాద్రి పాత ఆలయం స్థానంలో కొత్త గుడిని నిర్మించింది. టీటీడీ తరహాలో.. యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆ తర్వాత.. నుంచి యాదాద్రి గుడికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఇక సెలవు రోజుల్లో అయితే నరసింహ స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. అనతి కాలంలోనే తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు అసలే వేసవి సెలవులు కావడంతో.. భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అందుకు తగ్గట్టుగా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దాంతో పాటు కొండపవిత్రకు భంగం కలగకుండా.. తిరుమల తిరుపతి తరహాలో అనేక చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా యాదాద్రి ఆలయ అధికారులు కొత్త రూల్‌ని అమల్లోకి తీసుకువచ్చారు. అలాంటి పని చేసే వారికి ఇకపై నో దర్శనం అని చెబుతున్నారు. ఆ వివరాలు..

యాదాద్రి భక్తులకు ఆలయ అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. ఇకపై యాదాద్రి నరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తులు.. సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని.. లేదంటే దర్శనానికి అనుమతించమని తెలిపారు. తిరుమల తరహాలో యాదాద్రిలో కూడా ఇదే సంప్రదాయం అమలు చేయనున్నారు. ఇక తిరుమలలో స్వామి వారిని దర్శనం చేసుకోవాలంటే.. భక్తులు సంప్రదాయ దుస్తుల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఇదే నిర్ణయాన్ని యాదాద్రిలో కూడా అమలు చేయనున్నారు.

యాదాద్రి ఆలయంలో నిత్య కళ్యాణం, బ్రేక్‌ దర్శనాలు, ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా.. సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ ఈవో తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ధర్మ దర్శనం క్యూ లైన్లో వచ్చే భక్తులకు ఈ నియమం వర్తించదని అన్నారు. జూన్‌ 1 నుంచి ఈ నియమాలు కచ్చితంగా అమలు చేయనున్నట్లు ఆలయ ఈఓ స్పష్టం చేశారు. యాదాద్రి దర్శనానికి వచ్చే భక్తులు మగవారు తెల్లటి దుస్తులు, మహిళలు చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌‌‌‌‌‌‌‌, చీర, లంగావోణి వంటి దుస్తులు మాత్రమే ధరించాలని చెప్పారు. ఇవి కాకుండా వేరే దుస్తులు ధరిస్తే దర్శనానికి అనుమతి నిరాకరించనున్నారు.

ఇక తాజాగా యాదాద్రి ఆలయంలో ప్లాస్టిక్‌పై కూడా నిషేదం విధించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్‌పై నిషేదం విధఇంచినట్లు ఆలయ ఈవో గతంలోనే వెల్లడించారు. భక్తులు కవర్లు వంటివి తీసుకురాకుండా ప్రత్మామ్నాయాలు చూసుకోవలాని సూచించారు.

Show comments