iDreamPost
android-app
ios-app

వీడియో: డైరీ మిల్క్ చాక్లెట్లో బతికున్న పురుగు! ఎక్కడంటే?

  • Published Feb 12, 2024 | 11:45 AM Updated Updated Feb 12, 2024 | 11:45 AM

మనలో చాలామందికి చాక్లెట్స్ అంటే ఎంతో ఇష్టం. అందులోకి క్యాడబెరీ డైయిరీ మిల్క్ అంటే ఇంక ఎక్కువగా ఇష్టపడి తింటుటాం. మరి అలాంటి చాక్లెట్ ను ఎంతో ఇష్టంగా కొన్న వ్యక్తికి ఎదురైన సంఘటన తెలిస్తే ఒళ్ళు జల్లు మనిపించేలా అనిపిస్తుంది. ఇంతకి ఏం జరిగిందంటే..

మనలో చాలామందికి చాక్లెట్స్ అంటే ఎంతో ఇష్టం. అందులోకి క్యాడబెరీ డైయిరీ మిల్క్ అంటే ఇంక ఎక్కువగా ఇష్టపడి తింటుటాం. మరి అలాంటి చాక్లెట్ ను ఎంతో ఇష్టంగా కొన్న వ్యక్తికి ఎదురైన సంఘటన తెలిస్తే ఒళ్ళు జల్లు మనిపించేలా అనిపిస్తుంది. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published Feb 12, 2024 | 11:45 AMUpdated Feb 12, 2024 | 11:45 AM
వీడియో: డైరీ మిల్క్ చాక్లెట్లో బతికున్న పురుగు! ఎక్కడంటే?

‘చాక్లెట్స్’ ఇవి అంటే ఇష్టపడనివారంటూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాక్లెట్స్ ను ఎంతో అమితంగా తింటారు. ఇక మన ఇళ్లలో చిన్న పిల్లల విషయంలో అయితే వీటి ప్రాధాన్యత మరి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. వారు అల్లరి చేసిన , ఏడుస్తూన్న ఏదొక కారణంతో.. పెద్దవాళ్లు పిల్లలకు చాక్లెట్లను ఇస్తుంటారు. ఇలా వారికి చాక్లెట్స్ లేనిదే పొద్దు కూడా గడవదు. అయితే కొంతమంది మాత్రం శరీరక స్ట్రెస్ ను తగ్గించుకునేందుకు కూడా చాక్లెట్లను తింటుంటారు. అలాగే పుట్టినరోజు వేడుకలకు, ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వడానికి ఇలా రకరకాలుగా చాక్లెట్లను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే.. చాలామంది ఎక్కువగా, ఇష్టంగా తినే చాక్లెట్ ఏదంటే.. అది క్యాడబెరీ డైయిరి మిల్క్ అనే చెప్పాలి. దీనికి వయసుతో తేడా లేకుండా అందరూ లోట్టలేసుకుంటూ.. తింటారు. మరి, అలాంటి చాక్లెట్ లో తాజాగా అనుకొని అతిథి కనిపించడంతో.. ఒళ్ళు జల్లు మనిపించేలా అయ్యింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

క్యాడబెరీ డైయిరీ మిల్క్ అంటే మనలో చాలామందికి ఎంతో ఇష్టమైన చాక్లెట్. మరి, అలాంటి చాక్లెట్ లో బతికి ఉన్న పురుగు దర్శనం ఇస్తే.. ఇక జన్మలో చాక్లెట్లు తినేవారు సైతం వాటి జోలికి పోరు. అసలేం జరిగిదంటే.. తాజాగా ఓ వ్యక్తి అమీర్‎పేట్ మెట్రో స్టేషన్‎ దగ్గరలో ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ లో.. డైయిరీ మిల్క్ చాక్లెట్ ను కొనుగోలు చేశాడు. ఇక కొన్న తర్వాత ఆ వ్యక్తి దానిని తినేందుకు ఓపెన్ చేయగా.. పురుగు దర్శనం ఇచ్చింది. అంతే.. ఒక్కసారిగా ఆ వ్యక్తి కి ప్రాణం పోయినంత పని అయింది. అప్పటికే ఆ పురుగు ఆ చాక్లెట్ పై అటు ఇటు మెల్లగా పాకుతోంది. అది చూసిన ఆ వ్యక్తి వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఇక ఈ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ టీమ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వాళ్లు కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటారని జీహెచ్ఎంసీ అధికారులు సమాధానం ఇచ్చారు. ఇక ఈ ఘటన తో చాలామంది తల్లిదండ్రులు చిన్న పిల్లలకు చాకెట్లను కొని ఇవ్వాలంటేనే భయాందోళనకు గురి అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ విమర్శలతో దుమ్మెత్తిపోస్తున్నారు. ఎందుకంటే.. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగిన ఇప్పటికి అధికారులు వీటిపై దృష్టి పెట్టడంలేదని మండిపడుతున్నారు. మరి, డైయిరీ మిల్క్ చాక్లెట్ లో పురుగు కనిపించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.