iDreamPost
android-app
ios-app

Telangana: బాలికల హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు! కార్పొరేట్ కాలేజీలను వణికిస్తున్న మహిళా కమిషన్ ఛైర్ పర్సన్!

  • Published Oct 05, 2024 | 2:58 PM Updated Updated Oct 05, 2024 | 3:55 PM

Telangana: మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరళ్ల శారద బాలికల హాస్టల్స్ లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ పరిస్థితులు చూసి సీరియస్ అయ్యారు.

Telangana: మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరళ్ల శారద బాలికల హాస్టల్స్ లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ పరిస్థితులు చూసి సీరియస్ అయ్యారు.

Telangana: బాలికల హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు! కార్పొరేట్ కాలేజీలను వణికిస్తున్న మహిళా కమిషన్ ఛైర్ పర్సన్!

లక్షల్లో ఫీజులు వసూలు చేసే కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో చాలా సమస్యలు ఉంటాయి. గతంలో చాలా వెలుగులోకి వచ్చాయి. ఇంకా వస్తున్నాయి కూడా. అయితే ఈసారి మాత్రం ఇలాంటి కాలేజీలకు గట్టి షాకే తగిలింది. నారాయణ కాలేజీలో సమస్యల పట్ల విద్యార్థినిలు విసిగిపోయారు. ఎలాంటి భయం లేకుండా ముందుకు వచ్చారు. సమస్యలపై తమ గళం విప్పారు. తమ నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేసి వసతులు లేకుండా హాస్టళ్లు నడుపుతున్నారని ఆరోపించారు. ఇలాంటి కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేటు కాలేజీ హాస్టళ్లే కాకుండా ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలను కూడా చెక్ చేయాలని కోరారు. తమ తల్లిదండ్రులతో కలిసి తమ సమస్యలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు మహిళా కమిషన్ చైర్ పర్సన్  శారద. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా యాక్షన్ లోకి దిగారు. బాచుపల్లి లోని నారాయణ కాలేజీకి వెళ్లారు. ఆమె ఎంట్రీతో కాలేజీ యాజమాన్యం ఒక్కసారిగా షాక్ అయ్యింది.

శారద రావటంతోనే సడన్ గా అన్నీ చెక్ చేశారు. కాలేజీ ప్రాంగణంలో విద్యార్థినిల హాస్టళ్లకు వెళ్లారు. అక్కడ స్టూడెంట్స్ కి కావాల్సిన సౌకర్యాలు ఏమాత్రం సరిగా లేవు. మెస్ లను చెక్ చేశారు. ఆమె తనిఖీలో ఫుడ్ క్వాలిటీగా లేదని తేలింది. ఇక హాస్టల్ రూములు అయితే చాలా దారుణం. హాస్టల్ బిల్డింగ్ లో చాలా లీకేజీలు ఉన్నాయి. వాష్ రూమ్స్ శుభ్రంగా లేవు. భరించలేని విధంగా దుర్వాసన వెదజల్లుతుంది. డోర్స్ విరిగిపోయాయి. బాత్ రూంలో కనీసం మగ్గులు కూడా లేవు. వీటన్నింటిని చూసిన శారద ఒక్కసారిగా షాక్ అయ్యారు. పిల్లలు ఎంత నరకయాతన పడుతున్నారో ఆమెకు పూర్తిగా అర్ధం అయ్యింది. దీంతో కాలేజీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు.

ఈ సమస్యల గురించి హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపాల్ ను ప్రశ్నించారు. ఇలా ఉంటే జబ్బులు రావా అని నిర్వాహకులను ప్రశ్నించారు. “ఏంటి ఈ రూములు ఇలా ఉన్నాయి, డోర్స్ లేవు, లాక్స్ లేవు, వాటర్ కూడా పోవు, వాష్ రూంలో ఈ వాటర్ లీకేజీలు ఏంటి? మనుషులు ఉండే స్థలమేనా” అని శారద కోపంతో ప్రశ్నించారు. పిల్లలకు సరిగ్గా అన్నం వండకుండా పెడుతున్నారు, ఈ భోజనం ఎలా జీర్ణమవుతుందని ఆమె ప్రశ్నించారు. అదే విధంగా అక్కడి విద్యార్థినిలతో కాసేపు మాట్లాడారు. వారు కాలేజీలో ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సిబ్బందిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

బాచుపల్లి బ్రాంచి నుంచి ఇంకో బ్రాంచికి విద్యార్థినులను వెంటనే మార్చేయాలని ఆదేశించారు. ” మీకు ఏ సమస్య ఉన్నా నాకు కాల్ చేయండి, ఫిర్యాదు చేశారని ఎవరైనా వేధించినా నాకు సమాచారమివ్వండి” అంటూ శారద విద్యార్థినులను తన ఫోన్ నంబరు ఇచ్చారు. ఉమెన్ కమిషన్ ఫిర్యాదు నంబరు 9490555533 లేదా 181 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇక మాదాపూర్ లోని శ్రీచైతన్య ఉమెన్ కాలేజీలో కూడా ఇదే దారుణమైన పరిస్థితి. ఇవన్నీ కూడా శారద దృష్టికి రావడంతో యాక్షన్ తీసుకున్నారు. శ్రీచైతన్య యాజమాన్యానికి మహిళా కమిషన్ ఇప్పటికే సమన్లు పంపింది. పిల్లల భద్రత పైన రాజీపడే ఎవ్వర్ని వదిలిపెట్టేదెలేదని శారద చెప్పారు. మరి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్  శారద కార్పొరేట్ కాలేజీలపై చేసిన తనిఖీల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.