iDreamPost
android-app
ios-app

పారిశుద్ధ్య కార్మికురాలిగా MBA చదివిన యువతి!

ఎంతో మంది చదివిన చదువుకు ఉద్యోగం రాక తీవ్ర నిరాశలో ఉంటారు. అయితే కొందరు చేసే పని ఎంత నిజాయితీగా ఉందనేది చూస్తారు..తప్ప.. అది చిన్నదా పెద్దదా అని చూడరు. ఆకోవకు చెందిన ఓ యువతి.. ఎంబీఏ చదివినా పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తుంది.

ఎంతో మంది చదివిన చదువుకు ఉద్యోగం రాక తీవ్ర నిరాశలో ఉంటారు. అయితే కొందరు చేసే పని ఎంత నిజాయితీగా ఉందనేది చూస్తారు..తప్ప.. అది చిన్నదా పెద్దదా అని చూడరు. ఆకోవకు చెందిన ఓ యువతి.. ఎంబీఏ చదివినా పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తుంది.

పారిశుద్ధ్య కార్మికురాలిగా MBA చదివిన యువతి!

చాలా మంది ఎంత ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలని అసంతృప్తితో ఉంటారు. అలానే నేటికాలంలో ఎక్కువ మంది యువత కూడా తమ చదువుకు తగిన జాబ్ వస్తేనే ఉద్యోగంలో జాయిన్  అవుతున్నారు. అంతేకాక వారు అనుకున్న జాబ్ దొరక్కపోవడంతో తీవ్ర మనోవేధనకు గురవుతుంటారు. మరికొందరు మాత్రం తాము ఎంత పెద్ద చదువులు చదివిన.. పరిస్థితులకు తగ్గట్లు మారిపోతుంటారు. భవిష్యత్ చాలా గొప్పగా ఉంటుందనే నమ్మకంతో జీవితాన్ని సాగిస్తుంటారు. తాజాగా ఓ ఎంబీఏ గ్రాడ్యూయేట్ పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తుంది. అయితే అలా చేయడానికి గల కారణాలు అడగ్గా ఆసక్తికరమై విషయాలను ఆమె తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లాలోని వెంకటాపూర్ అనే గ్రామంలో బొక్కల మానస అనే మహిళ నివాసం ఉంటుంది. తన కుటుంబంతో కలిసి మానస నివాసం ఉంటూ జీవనం సాగిస్తుంది. ఇక బొక్కల మానస మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) చదివింది. అయితే తాను గొప్పగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలని ఎన్నో కలలను కన్నారు. అయితే మనం అనుకున్నట్లు జరిగితే.. ఇక అది జీవితం ఎందుకు అవుతుంది. జీవితం అంటేనే అనేక ట్విస్టుల ఎదురవుతుంటాయి. అలానే ఎంబీఏ చదివి.. మంచి ఉద్యోగం చేయాలనుకున్న మానస జీవితంలో కూడా కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

దీంతో ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు. ఎంబీఏ చేసిన ఆమె భర్త  కూడా ఆటో డ్రైవర్ గా మారారు. అలా ఆమె కార్మికురాలిగా పని చేస్తూ.. భర్త ఆటో నడుపుతు కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుటుంబ, ఆర్థిక పరిస్థితుల దృష్ణ్యా సొంతూరును వదల్లేక  పోయాని మానస తెలిపారు. అందుకే  అక్కడే దొరికిన పనితో తాము సంతృప్తిగా ఉన్నామని మానస తెలిపారు. మానసకు పోలీస్ కావాలనే బలమైన కోరిక ఉండేది. అందుకే  అందుకోసం నిరంతరం కృషి చేసింది. ఇటీవల పడిన పోలీస్ నోటిఫికేషన్ కు  దరఖాస్తు చేసింది. ఎంతో కష్టపడి పరీక్షలు రాసినా.. మానసకు అదృష్టం కలిసి రాలేదు. దీంతో ఇటీవల  పోలీస్ సెలెక్షన్లలో మానస ఎంపిక కాలేదు.

తాను పోలీసు ఉద్యోగానికి ప్రయత్నిస్తే ఒక్క మార్కుతో పోయిందని మానస తెలిపారు. ఈక్రమంలోనే ఆ దంపతులు ఇద్దరు స్థానికంగా పని చేసుకుంటూ సంతృప్తిగా జీవిస్తున్నారు. తమ చదువుకు తగ్గట్లు ఏదైనా  ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మానస కోరుతున్నారు. చూశారా.. ఎంతో మంది తమ చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని.. చిన్న పనులు చేయడానికి వెనుకడు వేస్తుంటారు. నిజాయితీతో కూడిన ఏ చిన్న పని, ఉద్యోగం అయినా గొప్పదేనని గుర్తించలేకపోతున్నారు. అలాంటి వారందరు మానసను చూసి ఆలోచన ధోరణి మార్చుకోవాలి. మరి… ఎంబీఏ చదివి పారిశుద్ధ్యా కార్మికురాలిగా పని చేస్తున్న మానసపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.