Dharani
Hayathnagar: పొద్దుపొద్దున్నే మద్యం సేవించి బస్సు ఎక్కిన ఓ మహిళ.. రచ్చ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.
Hayathnagar: పొద్దుపొద్దున్నే మద్యం సేవించి బస్సు ఎక్కిన ఓ మహిళ.. రచ్చ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.
Dharani
మద్యం మత్తు వల్ల ఎలాంటి ప్రమాదాలు చోటు చోసుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సమాజంలో చోటు చేసుకునే చాలా ప్రమాదాలకు మద్యం మత్తే ప్రధాన కారణం. అదలా ఉంచితే.. కొందరు మద్యం మత్తులో ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బస్సుల్లో, ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ చేసే సమయాల్లో మందు బాబులు చేసే రచ్చ ఇప్పటికే చాలా సందర్భాల్లో చూశాం. అయితే మద్యం తాగి ఇలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించే వారిలో ఆడవారు కూడా ఉండటం గమనార్హం.
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల సందర్భంగా మద్యం తాగిన ఆడవాళ్లు.. పోలీసులనే ఇబ్బంది పెడతారు. వారికి చుక్కలు చూపిస్తారు. కానీ అధికారులు మాత్రం ఎంతో సంయమనంతో వ్యవరిస్తూ.. వారిని అక్కడి నుంచి పంపించి వేస్తుంటారు. ఇక తాజాగా ఆర్టీసీ బస్సులో ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఫుల్లుగా మందు కొట్టి బస్ ఎక్కిన ఓ యువతి.. రచ్చ రచ్చ చేసింది. కండక్టర్‌ని నానా బూతులు తిడుతూ.. అతడిపై దాడి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
హయత్ నగర్ బస్ డిపో 1 కు చెందిన కండక్టర్‌పై ఒక మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఎప్పుడు చోటు చేసుకుంది అనే దానికి సంబంధించిన వివరాలు లభ్యం కాలేదు. వీడియోలో ఉన్న దాని ప్రకారం.. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం హయత్ నగర్ 1 డిపోకు చెందిన హయత్ నగర్ టూ అఫ్టల్ గంజ్ రూట్‌లో నడిచే 72 బస్ సర్వీస్‌లో పొద్దు పొద్దునే ఒక మహిళ మద్యం సేవించి బస్సులోకి ఎక్కింది.
టికెట్ కోసం కండక్టర్‌కి 500 రూపాయల నోటు ఇచ్చింది. దాంతో అతడు ఇంత పొద్దున్నే చిల్లర ఉండదని చెప్పాడు. ఆ సమాధానంతో ఆగ్రహించిన మహిళ.. సదరు బస్ కండక్టర్‌ని నోటితో పలకలేని.. రాయలేని రీతిలో నానా బూతులు తిడుతూ, దుర్భాషలాడుతూ చేత్తో కొడుతూ కాలుతో తన్నడం జరిగింది. అంతేకాక అతడిపై ఉమ్మేసింది. బస్సులో ఉన్న తోటీ ప్రయాణికులు ఎంత వారించినా పట్టించుకోలేదు. వారిని లెక్కచేయకుండా.. కండక్టర్‌పై దాడికి దిగింది. ఆమె పోరు భరించలేక ఓ పక్కకు బస్సు ఆపడంతో అక్కడ దిగిపోయింది. దిగే ముందు బస్సులో ఉన్న మరో మహిళను కూడా నానా బూతులు తిట్టింది.
ఈమొత్తం తతంగాన్ని బస్సుల్లో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరలవుతోంది. నానా బూతులు తిట్టినా సరే.. మహిళ అనే గౌరవంతో సదరు కండక్టర్ సంయమనం పాటించడం హయత్ నగర్ బస్ డిపో ఆర్టీసీ ఉద్యోగుల క్రమశిక్షణకు అద్దం పడుతుంది అంటున్నారు నెటిజనులు. అలానే డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన కాకుండా పోలీస్ స్టేషన్ దగ్గర ఆపి ఉంటే.. బాగుండేది.. ఆమహిళకు వాళ్లు బుద్ధి చెప్పేవారు అని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’’ అని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
బస్సు కండక్టర్ మీద దాడి చేసి కాలుతో తన్నిన మహిళ
హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన కండక్టర్ మీద ఓ మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు… pic.twitter.com/SAZ2gPxSGY
— Telugu Scribe (@TeluguScribe) January 31, 2024
హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు…
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) January 31, 2024