iDreamPost
android-app
ios-app

RTC కండక్టర్ నిజాయితీ.. రూ. 8 లక్షల విలువైన బంగారాన్ని తిరిగి అప్పగించింది

ఓ మహిళా కండక్టర్ నిజాయితీ ఆ ప్రయాణికురాలి పట్ల వరంగా మారింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ రూ. 8 లక్షలు విలువ చేసే బంగారు నగలతో కూడిన బ్యాగును బస్సులోనే మరిచిపోయి తన గమ్యస్థానం రాగానే దిగిపోయింది. కా

ఓ మహిళా కండక్టర్ నిజాయితీ ఆ ప్రయాణికురాలి పట్ల వరంగా మారింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ రూ. 8 లక్షలు విలువ చేసే బంగారు నగలతో కూడిన బ్యాగును బస్సులోనే మరిచిపోయి తన గమ్యస్థానం రాగానే దిగిపోయింది. కా

RTC కండక్టర్ నిజాయితీ.. రూ. 8 లక్షల విలువైన బంగారాన్ని తిరిగి అప్పగించింది

తెలంగాణ రాష్ట్ర పండుగైన బతుకమ్మ పండుగ ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. కాగా రేపు సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని పట్నంలోని పల్లే జనమంతా తమ తమ సొంతూళ్లకు పయనమయ్యారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగ కుండా టీఎస్ఆర్టీసీ డిమాండ్ కు సరిపడా బస్సులను ఏర్పాటు చేసింది. అయితే బస్సులో ప్రయాణికులు తమ విలువైన వస్తువులు పోగొట్టుకున్న సందర్భాల్లో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు నిజాయితీతో వ్యవహరించి వారికి తిరిగి అప్పగిస్తున్నారు. తాజాగా ఓ మహిళా కండక్టర్ ఓ ప్రయాణికురాలు బస్సులో మరిచిపోయిన రూ. 8 లక్షలు విలువచేసే నగల బ్యాగును తిరిగి అప్పగించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఓ మహిళా కండక్టర్ నిజాయితీ ఆ ప్రయాణికురాలి పట్ల వరంగా మారింది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ రూ. 8 లక్షలు విలువ చేసే బంగారు నగలతో కూడిన బ్యాగును బస్సులోనే మరిచిపోయి తన గమ్యస్థానం రాగానే దిగిపోయింది. కాగా ఆ బస్సులోని మహిళా కండక్టర్ వాణి ఆ బ్యాగును గమనించింది. బ్యాగు తెరిచి చూడగా బంగారు నగలు కనిపించాయి. అదే బ్యాగులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా ప్రయాణికురాలికి సమాచారం అందించింది. ఆ తర్వాత నగలతో కూడిన బ్యాగును మహిళా కండక్టర్ తిరిగి అప్పగించింది. నిజాయితీ చాటుకున్న కండక్టర్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది.

కాగా నిన్న రాత్రి పెద్దపల్లి నుంచి జగిత్యాల వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు ప్రయాణించింది. అయితే ఆమె బంగారు నగలతో కూడిన బ్యాగును బస్సులోనే మరిచిపోయి దిగిపోయింది. ఆ తర్వాత ఆ బ్యాగును గమనించిన కండక్టర్ వాణి ఆ బ్యాగులో బంగారు నగలు ఉన్నాయని గుర్తించింది. బ్యాగులో దొరికిన ఫోన్ నెంబర్ ఆదారంగా ప్రయాణికులరాలికి సమాచారం అందించింది. జగిత్యాల డిపో మేనేజర్ సమక్షంలో రూ. 8 లక్షలు విలువ చేసే బంగారాన్ని మహిళా ప్రయాణికులరాలికి అప్పగించారు. నిజాయితీ చాటుకున్న మహిళా కండక్టర్ వాణిని డీఎం అభినందించారు. బాధిత మహిళ మాట్లాడుతూ.. నగలు పోయాయనే దుఖంలో ఉండగా కండక్టర్ ఫోన్ చేసి నగల బ్యాగు తమ వద్ద సురక్షితంగా ఉందని డిపోకి వచ్చి తీసుకోవాలని చెప్పడంతో సంతోషం కలిగిందని తెలిపింది. ఈ సందర్బంగా కండక్టర్ వాణికి, డ్రైవర్ తిరుపతికి ధన్యవాదాలు తెలిపింది.