Tirupathi Rao
Wine Shops Close: మందుబాబులకు పోలీసులు షాకిచ్చారు. ఒకరోజు మద్యం దుకాణాలను మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరి ఏరోజు మద్యం దుకాణాలు మూసివేస్తున్నారో చూడండి.
Wine Shops Close: మందుబాబులకు పోలీసులు షాకిచ్చారు. ఒకరోజు మద్యం దుకాణాలను మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరి ఏరోజు మద్యం దుకాణాలు మూసివేస్తున్నారో చూడండి.
Tirupathi Rao
రాష్ట్రం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఏ ప్రభుత్వానికి అయినా అతిపెద్ద ఆదాయ వనరు ఏదైనా ఉంది అంటే అది ఆబ్కారీ శాఖ నుంచే అని చెప్పచ్చు. ప్రాంతం ఏదైనా, సందర్భం ఏదైనా కొందరు మాత్రం దానిని మద్యంతోనే సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే నిత్యం మద్యం అమ్మకాలు జోరుగా సాగుతూ ఉంటాయి. అయితే ఎంత ఆదాయం వచ్చినా కూడా కొన్ని కారణాల వల్ల మద్యం దుకాణాలను మూసేస్తూ ఉంటారు. ఎలక్షన్స్ సమయంలో, అలాగే ఎక్కువ పబ్లిక్ ప్లేసెస్ లో సంబరాలు చేసుకునే పండగలు ఉన్నప్పుడు మద్యం దుకాణాలను మూసేస్తూ ఉంటారు. ఈ విషయంలో పోలీసులు కూడా నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా పోలీసులు ఆరోజు మద్యం దుకాణాలను బంద్ చేయాలని చెప్పారు.
మద్యం దుకాణాల వల్ల ఆదాయం ఎలా వస్తుందో.. ఒక్కోసారి లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా తలెత్తూ ఉంటాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు మద్యం దుకాణాలను మూసేస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్ పోలీసులు ఒకరోజు మద్యం దుకాణాలు మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అది మరెప్పుడో కాదు.. హోలీ పండుగ సందర్భంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మార్చి 25వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి మార్చి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు సిటీలో మద్యం షాపులు మూసివేయాల్సిందిగా సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి ఆదేశాలు జారీ చేశారు.
అలాగే పండుగ వేడుకలకు సంబంధించి కూడా కొన్ని క్లియర్ ఆదేశాలు జారీ చేశారు. హోలీ వేడుకల్లో పాల్గొనేవాళ్లు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని స్పష్టం చేశారు. అలాగే సిటీలో తిరిగే వాహనదారులపై రంగులు చల్లకూడదని ఆదేశించారు. చాలా మంది హోలీ అనగానే బైకుల మీద సిటీ మొత్తం తిరుగుతూ నానా హంగామా చేస్తుంటారు. అలాంటి వారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి పనులు చేయొద్దని, పబ్లిక్ రోడ్స్ మీద న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దంటూ సూచించారు. సాధారణంగా హోలీ అనగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు మిన్నంటుతాయి.
చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటారు. అయితే ఇదే అదునుగా కొందరు ఆకతాయిలు తుంటరి పనులు చేస్తుంటారు. అలాంటి వారికి కూడా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అలాగే హోలీ అనగానే పెద్ద ఎత్తున ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లు కూడా అన్ని జాగ్రత్తలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి అన్నారు. హోలీ సంబరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సైబరాబాద్ సీపీ మద్యం షాపులు మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరి.. హోలీ సందర్భంగా మద్యం దుకాణాలు మూసేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.