మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు వైన్స్ బంద్

Wine shops: మద్యం ప్రియులకు అలర్ట్. రెండు రోజుల పాటు వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. ఇంతకీ ఎక్కడ? ఏయే తేదీల్లో వైన్ బంద్ కానున్నాయంటే?

Wine shops: మద్యం ప్రియులకు అలర్ట్. రెండు రోజుల పాటు వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. ఇంతకీ ఎక్కడ? ఏయే తేదీల్లో వైన్ బంద్ కానున్నాయంటే?

ఈ రోజుల్లో ఫంక్షన్ ఏదైనా సరే మద్యం ఉండాల్సిందే. మద్యం చుక్క లేకుండా దాదాపు ఏ వేడుక జరగడం లేదు. వీకెండ్స్, పండగ రోజుల్లో అయితే మద్యం ఏరులై పారుతుంది. ఇక కొందరికి అయితే చుక్క పడనిదే పూట గడవని పరిస్థితి ఉంటుంది. ఎప్పుడెప్పుడు వైన్స్ ఓపెన్ చేస్తారా అని చూస్తుంటారు. సంతోషం వచ్చిన, దు:ఖం వచ్చిన మద్యంతో సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అన్నట్టు తయారయ్యారు జనాలు. ఒక్కరోజు మద్యం షాపులు మూసి ఉన్న కూడా విలవిల్లాడిపోతుంటారు మందుబాబులు. ఇలాంటి వారికి బ్యాడ్ న్యూస్. మద్యం షాపులు రెండు రోజుల పాటు బంద్ కానున్నాయి. ఏ కారణంతో బంద్ కానున్నాయంటే?

ఆశాఢ మాసంలో హైదరాబాద్ లో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. భక్తి శ్రద్ధలతో అమ్మ వార్లకు బోనాలు సమర్పించి కొలుస్తుంటారు. అత్యంత వైభవంగా జరుపుకుంటున్న బోనాల పండుగ నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు మద్యం షాపులు మూసి వేయాలని నిర్ణయించారు. మహంకాళీ బోనాల పండుగ ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అంతటా.. నాన్ ప్రొప్రయిటరీ క్లబ్ లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్ లతో సహా అన్ని వైన్స్ షాపులు మూసివేయబడతాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. జూలై 28 ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు వైన్స్ షాపులన్నీ మూసివేయబడతాయని తెలిపారు.

సౌత్ ఈస్ట్ జోన్‌లో చాంద్రాయణగుట్ట, బండ్లగూడ వంటి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటలనుంచి 24 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయబడతాయి. సౌత్ జోన్‌లో చార్మినార్, కమాటిపుర, హుస్సేనీ ఆలం, ఫలక్‌నుమా, మొఘల్‌పురా, చైటినాక, షాలి బండ , మీర్‌చౌక్ ప్రాంతాల్లో జూలై 28 ఉదయం 6 గంటలనుంచి రెండు రోజుల పాటు మద్యం దుఖాణాలు మూసివేయబడతాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెండు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనుండడంతో మద్యం ప్రియులు ఉసూరుమంటున్నారు. ఇటీవల పలు పండగల నేపథ్యంలో వైన్స్ షాప్స్ మూసి వేస్తుండడంతో మద్యం లవర్స్ నిరాశ చెందుతున్నారు.

Show comments