iDreamPost

మందుబాబులకు బ్యాడ్ న్యూస్! రేపు వైన్ షాపులు బంద్.. ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్!

Wine Shops Closed: ఇటీవల తరచూ వివిధ కారణాలతో మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు. తాజాగా మరోసారి కూడా వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మద్యం దుకాణాలను మూసివేయనున్నారు.

Wine Shops Closed: ఇటీవల తరచూ వివిధ కారణాలతో మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు. తాజాగా మరోసారి కూడా వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మద్యం దుకాణాలను మూసివేయనున్నారు.

మందుబాబులకు బ్యాడ్ న్యూస్! రేపు వైన్ షాపులు బంద్.. ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్!

నేటికాలంలో మద్యం తాగేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా కొందరికి అయితే మద్యం చుక్కపడనిదే రోజు ప్రారంభం కాదు. ఇక ఏదైనా వేడుక జరిగిదంటే.. మద్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. అది లేని కార్యక్రమం ఉండదు అంటే అతిశయోక్తి కాదు.  ఇక ఆదివారం వచ్చిందంటే.. చాలు చాలా మంది మద్యం తాగుతూ గడిపిస్తుంటారు. ఇది ఇలా ఉంటే.. ఎన్నికల ఫలితాల వేళ మద్యం ప్రియులకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. రేపు వైన్ షాపు మూతపడనున్నాయి. మరి… ఎక్కడ, ఏమిటి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం…

జూన్4 మంగళవారం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అలానే తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు రేపు కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరం పరిధిలోని వైన్ షాపులు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జూన్‌ 4న ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు. నగరంలో ఐదుగురికి మించి గుమిగూడకుండా ఉండేలా పోలీసులు ఆంక్షలు అమలుచేయనున్నారు. అదేవిధంగా మద్యం, బీర్ షాపులను కూడా మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. ఎవరైన అక్రమంగా మద్యం నిల్వ చేసినా,విక్రయించిన కఠిన చర్యలు తప్పవని పోలీసులు అధికారులు హెచ్చరించారు.

ఇటీవల కాలంలో ఎన్నికల వేళ తరచూ వైన్ షాపులు బంద్ అవుతున్నాయి. ఇప్పటికే వివిధ కారణాలతో మూడు,నాలుగు సార్లు మద్యం దుకాణాలు మూతపడ్డాయి. తాజాగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గొడవలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలను జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల కౌంటింగ్ జూన్‌ 4న జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్నీ ఏర్పాట్లను  పూర్తి చేశారు.

హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 కౌంటింగ్‌ కేంద్రాలున్నాయి. అలానే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎక్కువ పోలీంగ్ కేంద్రాలు ఉన్న చోట పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. కౌంటింగ్‌ హాల్ లోకి ఈసీ జారీ చేసిన పాసులు ఉన్నవారిని మాత్రమే పోలీసులు అనుమతించనున్నారు. మొత్తంగా రేపు హైదరాబాద్ నగరంలో మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో మందు బాబులు ముందుగానే అప్రమత్తమయ్యే  వైన్ షాపులకు బారులు తీరినట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి