మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. వైన్ షాపులు, బార్లు బంద్!

Wine Shops Close: దేశ వ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు విడతల్లో ఎన్నికలు జరగ్గా.. త్వరలో మరికొన్ని రాష్ట్రాల్లో ఓట్ల పండగ ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే తరచూ మందు బాబులకు బ్యాడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి వారికి అలాంటి వార్తే వచ్చింది.

Wine Shops Close: దేశ వ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు విడతల్లో ఎన్నికలు జరగ్గా.. త్వరలో మరికొన్ని రాష్ట్రాల్లో ఓట్ల పండగ ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే తరచూ మందు బాబులకు బ్యాడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. తాజాగా మరోసారి వారికి అలాంటి వార్తే వచ్చింది.

ఈ మధ్యకాలంలో మద్యం తాగే వారి సంఖ్య బాగా పెరిగింది. ఏ చిన్న వేడుక చేసిన అక్కడ మందు తప్పని సరిగా ఉంటుంది. అదిలేనిదే పార్టీ లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఆదివారం వచ్చిదంటే చాలు.. చాలా మంది మద్యం  మునిగి తేలుతుంటారు. కొందరికి అయితే మద్యం తాగడంతోనే రోజు ప్రారంభమవుతుంది. ఇలా మద్యంతో ఎంజాయ్ చేసే మందుబాబులకు  ఇటీవల తరచూ బ్యాడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. రాబోయే పండగలను, ఎన్నికల ను దృష్టిలో ఉంచుకుని మద్యం షాపులు బంద్ చేస్తుంటారు. తాజాగా మరోసారి తెలంగాణ మందుబాబులకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

దేశ వ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతల్లో ఎన్నికలు జరగగా.. త్వరలో మరికొన్ని రాష్ట్రాల్లో ఓట్ల పండగ ఉండబోతుంది. దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ కి రెండు రోజుల ముందు నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్లు మూసివేస్తున్నారు.  ఇప్పటికే ఎక్కడ ఎన్నికల పోలింగ్ జరిగేతే అక్కడ రెండు రోజుల ముందు మద్యం షాపులను మూసేస్తున్నారు. గతంలో తెలంగాణలో మరో మూడు రోజులు మద్యం షాపులను బంద్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఎన్నికల నేపథ్యంలోనే తెలంగాణలో మద్యం, బీరు షాపులు బంద్ కానున్నాయి.

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరగనున్నసంగతి తెలిసిందేం. ఈ నెల 27న జరగనున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల పోలింగ్ జరిగే మూడు జిల్లాల్లో మద్యం షాపులు, బార్లను  రెండు రోజుల బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో రేపు మే25 శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 27న సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్‌లు బంద్ మూతబడనున్నాయి.

ఇదే సమయంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అందుకు తగినట్లే ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఎమ్మెల్యే ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగాం ఎమ్మెల్యేగా గెలుపొందడం.. ఆ పదవి రాజీనామ చేయడం… అక్కడ ఉపఎన్నిక అనివార్యంమైంది. మొత్తంగా రానున్న రెండు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి.

Show comments