P Venkatesh
చుక్క పడితే గాని పొద్దుగడవని మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. ఏకంగా మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి.
చుక్క పడితే గాని పొద్దుగడవని మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. ఏకంగా మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి.
P Venkatesh
చుక్క పడితే గాని పొద్దుగడవని మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. ఏకంగా మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీనికి గల కారణం ఈ నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిలు జరగడమే. పోలింగ్ నేపథ్యంలో ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ వైన్స్, బార్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ నిర్ణయంతో 2023 నవంబర్ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రం మొత్తం వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి.
గత నెలలో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ తాజాగా ఈరోజు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఈ రోజు ఉ.11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రక్రయి ప్రారంభమైంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ నవంబర్ 28, 29, 30వ తేదీల్లో.. మూడు రోజులపాటు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశించింది. ఈ మేరకు మద్యం షాపుల లైసెన్స్ దారులకు ఆదేశాలిచ్చింది. రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రభావితం చేయకుండా, ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా నేటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 10 వరకు అభ్యర్థులు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈనెల 13న నామినేషన్ల పరిశీలన చేయనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల15 చివరితేదీగా ప్రకటించారు.