iDreamPost
android-app
ios-app

మేడారం జాతరలో బెల్లాన్ని.. బంగారమని ఎందుకు అంటారు?

  • Published Feb 12, 2024 | 8:44 PM Updated Updated Feb 12, 2024 | 8:44 PM

మేడారం జాతరలోని సమ్మక్క, సారలమ్మలకు నైవేద్యంగా సమర్పించే బెల్లాన్ని బంగారంగా ఎందుకు పిలుస్తారు, అది ఎందుకు బంగారమెందుకైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

మేడారం జాతరలోని సమ్మక్క, సారలమ్మలకు నైవేద్యంగా సమర్పించే బెల్లాన్ని బంగారంగా ఎందుకు పిలుస్తారు, అది ఎందుకు బంగారమెందుకైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Feb 12, 2024 | 8:44 PMUpdated Feb 12, 2024 | 8:44 PM
మేడారం జాతరలో బెల్లాన్ని.. బంగారమని ఎందుకు అంటారు?

సాధారణంగా ఏ ఆలయాల్లో అయిన పండ్లు రకరకాల ఆహార పదార్థాలు పానీయాలతో దేవుళ్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ, ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పిలిచేటువంటి మేడారం జాతరలోని సమ్మక్క, సారలమ్మలకు మాత్రం.. చీర, గాజులు , పసుపు కుంకుమలతో పాటు బంగారంను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. అది కూడా మనుషుల నిలువెత్తు బంగారన్ని అమ్మవారికి సమర్పిస్తుంటారు. అది ఏంటి మనుషుల నిలవెత్తు బంగారం అమ్మవారికి సమర్పించడమా అని ఆశ్చర్యపోతున్నారా? అలా అనుకుంటే పొరపాటే. ఇక్కడ బంగారం అంటే నిజమైన బంగారం కాదు, బెల్లంనే బంగారంగా భావిస్తుంటారు. రెండెళ్లకోసారి జరిగే ఈ మేడారం జాతరలో టన్నుల కొద్ది బెల్లాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవార్లకు సమర్పిస్తుంటారు. అయితే ఈ బెల్లం బంగారంగా ఎందుకు భావిస్తారు? ఇంతకీ మేడారం జాతరలో బెల్లం ఎందుకంత ప్రత్యేకం? ఇది బంగారమెందుకైంది? అనే ప్రశ్నలకు రకరకాల కథలు వినిపిస్తున్నాయి. అవి ఏంటో చూద్దం.

ఈ నెల 16 నుంచి 19 వరకు జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అంతా సర్వసిద్ధంగా ఉంది. దీంతో ప్రజలు ఇప్పటి నుంచే భారీగా తరలివెళ్తు.. అక్కడ నిలవెత్తు బంగారన్ని కానుకగా సమర్పించుకుంటున్నారు. అయితే అక్కడ బంగారన్ని బెల్లంగా ఎందుకు పిలుస్తారు అనే ప్రశ్న చాలామందిలో ఆసక్తిగా మిగిలిపోయింది. కానీ, ఇందుకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో విధాంగా కథలు చెబుతుంటారు. మరికొందరు అయితే అమ్మవార్లకు భక్తి, శ్రద్ధలతో బెల్లాన్ని సమర్పిస్తే.. చల్లగా చూస్తుందని నమ్ముతుంటారు. ఇక ఏది ఏమైనా బెల్లం బంగారంగా మారడానికి వెనుక కొన్ని తరాల నుంచి ఓ కథ వినిపిస్తునే ఉంది. అదేమిటంటే.. ‘పూర్వం మేడారం జాతరను కేవలం అడవి ప్రాంతంలో ఉండే ఆదివాసీలు మాత్రమే జరుపుకునే వారట. పైగా అప్పటిలో వారి ఆచారాలు కూడా కాస్తా భిన్నంగా ఉండేవి. అలాగే వారికి బెల్లం, ఉప్పు అంటే చాలా ఇష్టమట. వీటిని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేవారు. కాగా, వీరు బెల్లానికి ఎక్కువ విలువను ఇవ్వడంతో పాటు.. ఖరీదైనదిగా భావించేవారట. మరి బెల్లన్ని అంత విలువైనదిగా భావించేవారు కాబట్టి.. సమ్మక్క, సారలమ్మకు బెల్లాన్ని సమర్పిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బెల్లన్ని, బంగారంగా పిలుచేవారని చాలామంది చెబుతుంటారు.

ఇక ఈ బెల్లంకు ఇంకో రకమైన కథ కూడా ఉంది. అదేమిటంటే.. ‘పూర్వం బెల్లంను కాకతీయుల కాలం నుంచి అమ్మవారలకు సమర్పించడం జరుగుతోంది. ఈ క్రమంలోనే.. ఎంతోమంది భక్తులు చాలాదూరం నుంచి ప్రయాణించి తల్లుల దగ్గరకు చేరుకునేవారట. అప్పుడు అమ్మవార్ల గద్దెల వద్ద ఉన్న బెల్లంను ఆకలిగా ఉన్నప్పడు ఆహారంగా తీసుకొనేవారట. అలా అప్పటి నుంచి ఈ బెల్లం చాలా విలువైనదిగా భావించి సమ్మక్క, సారలమ్మకు సమర్పించడం మొదలైందని కథలు కథలుగా చెబుతుంటారు’. ఇలా అనాదికాలంగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాన్ని ఇప్పటికి కొనసాగిస్తున్నారు. ఇందుకు కోసం ఇతర రాష్టాల నుంచి కూడా భక్తులు కోట్ల సంఖ్యల్లో విచ్చేసి అమ్మవార్లకు బంగారన్ని సమర్పించడం వలన వారి కోరికలు నేరవేరడంతో పాటు.. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మకం. మరి, మేడారం జాతరలో బెల్లన్ని, బంగారంగా భావించడం వెనుక ఉన్న కథల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.