తెలంగాణలో బీర్ల షార్టేజ్ ఎందుకు వచ్చింది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!

Beer Shortage in Telangana: తెలంగాణలో పార్టీ కల్చర్ పెరిగిపోతుంది. బీర్లు చౌకగా.. విరివిగా దొరకడంతో డిమాండ్ పెరిగిపోయింది. దీంతో బీర్ల రెవెన్యూ కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలోనే బీర్ల కొరత ఏర్పడటంపై మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Beer Shortage in Telangana: తెలంగాణలో పార్టీ కల్చర్ పెరిగిపోతుంది. బీర్లు చౌకగా.. విరివిగా దొరకడంతో డిమాండ్ పెరిగిపోయింది. దీంతో బీర్ల రెవెన్యూ కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలోనే బీర్ల కొరత ఏర్పడటంపై మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా వేసవి కాలంలో మందుబాబులు ఎక్కువగా బీర్లు తాగడానికి మొగ్గు చూపుతుంటారు. వేడి వాతావరణంలో చల్ల చల్లని బీరు తాగితే ఆ మజాయే వేరు అంటుంటారు మందుబాబులు. అందుకే వేసవి కాలంలో వైన్స్ షాపుల ముందు క్యూ కట్టేస్తుంటారు. ఈ మధ్య తెలంగాణలో బీర్ల కొరత తీవ్రంగా ఉంది.. కొన్ని వైన్స్ షాపుల్లో అయితే ఏకంగా నో స్టాక్ బోర్డులే దర్శనం ఇస్తున్నాయి. ఎక్కడో కొన్ని షాపుల్లో మాత్రమే కొద్ది మొత్తంలో బీర్లు దొరుకుతున్నాయి.  లైట్ బీర్లు, కేఎఫ్ లైట్, బడ్ వైజర్ లాంటి బీర్లు కంటికి కనిపించడం లేదు. లైట్ బీర్ల కొరత వల్ల  మందు బాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు తెలంగాణలో బీర్లు ఎందుకు షార్టేజ్ అవుతున్నాయి.. దీనికి గల కారణం ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

తెలంగాణలో గత కొన్నిరోజులుగా బీర్లు షార్టేజ్‌తో మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వైన్స్ షాపుల్లో బీర్లు నో స్టాక్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయని బాధపడుతున్నారు. కొంతమంది సిండికేట్ గా ఏర్పడి బీర్ల కొరత సృష్టించి బ్లాక్ లో అమ్ముతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అయితే డిమాండ్ కి తగ్గట్టు బీర్ల సప్లై లేకపోవడం వల్లనే షార్టేజ్ ఏర్పడుతుందని.. బ్లాక్ లో అమ్ముకోవడం లేదని వైన్స్ షాపుల యజమానులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వేసవి కాలం భూమిలో నీరు ఇంకి పోవడం వల్ల నీటి కొరత ఏర్పడుతుంది. నీటి సరఫరా లేకపోవడం వల్ల బీర్లు తయారీలో ఇబ్బందులు ఏర్పడి షార్టేజ్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా బీర్ల కొరతపై వస్తున్న వరుస కథనాలపై ప్రొహిబీషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కమీషనర్ శ్రీధర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో మూడో షిఫ్ట్ అనుమతించకపోవడం వల్లనే షార్టేజ్ వచ్చిందని వస్తున్న వార్తలో నిజం లేదని కొట్టిపడేశారు.

తెలంగాణ రాష్ట్రంలో 19 మద్యం తయారీ కంపెనీలున్నాయి. వీటిలో 6 బీరు తయారు చేసే కంపెనీలు. ఈ బ్రూవరీలలో ప్రతి నెల 50 లక్షల బీరు కేసులు ఉత్పత్తి అవుతాయి.. ఈ కంపెనీలకు రాష్ట్రమే ముడిసరుకు సరఫరా చేస్తుంది.. మద్యం తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా రిటైలర్లకు పంపిణి చేస్తున్నారు.  లైసెన్స్ కండీషన్స్ ప్రకారం బీర్ల ప్రొడక్షన్ ఉంటుందని, ఒకే ఫిఫ్ట్ కి పరిమిషన్ ఉంటుందని ప్రొహిబీషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కమీషనర్ శ్రీధర్ తెలిపారు. డిమాండ్ మేరకు ఫీజు చెల్లించిన వారికి మూడు షిఫ్టులకు అనుమతి ఇస్తాం అన్నారు. బీర్ల కంపెనీల్లో నాలుగు బీర్ల కంపెనీ తమకు డిమాండ్ ఉన్న బ్రాండ్స్ ఎక్కువగా సప్లై చేస్తున్నాయి. ఈ నాలుగు సంస్థలు మూడు షిఫ్టులకు పర్మీషన్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం కింగ్ ఫీషర్ కొరత ఉన్నదని మిగతా బ్రాండ్స్ లభిస్తున్నాయని క్లారిటీ ఇచ్చారు. మూడు షిఫ్లులు పర్మిషన్ తీసుకున్న కంపెనీలు కేవలం 2.51 లక్షల కేసుల బీర్లు ప్రొడక్షన్ చేస్తున్నాయని క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. కొంత కాలంగా వైన్స్ షాపుల్లో లైట్ బీర్లు, కేఎఫ్ లైట్, బడ్ వైజర్ టిన్స్ బీర్స్, క్యూబెర్గ్, ఆర్సీ లైట్ వంటి బ్రాండ్లు అస్సలు దొరకడం లేదు.. కొన్ని వైన్స్ షాపుల్లో ఈ బీర్ల కోసం ఎంత తిరిగినా నో స్టాక్ అనే సమాధానమే వస్తుంది. లైట్ బీర్లకు ఎందుకు ఇంత కొరత వచ్చిందని మందుబాబులు మండి పడుతున్నారు. అయితే దీనికి గల కారణం నీటి కొరత, షిఫ్టులకు పర్మీషన్ ఇవన్నీ పక్కన బెడితే.. ఖరీదైన బీర్ల విక్రయాల్ని పెంచుకోవడం కోసం లైట్ బీర్లను మార్కెట్ లోకి తీసుకురావడం లేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు బీర్ల కొరతకు మరో కారణం ఉందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. లైట్ బీర్ల కొరత ఏర్పరచి ఖరీదైన బీర్ల అమ్మకాల ద్వారా ఎక్కువ ఆదాయం పొందే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

దేశంలో అత్యధికంగా బీరు వినియోగిస్తున్న తెలంగాణలో ఎంతో క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే బీర్ డిమాండ్ అనుగుణంగా కొత్త మద్యం కంపెనీలకు రాష్ట్ర బేవరేజెస్ కార్పోరేషన్ అనుమతి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సోమ్ డిస్టలరీస్ అండ్ బ్రూవరీస్ బీర్లను సరఫరా చేయడానికి అనుమతి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర బేవరేజ్ కార్పోరేషన్ దబాంగ్, లే మౌంట్, మౌంట్స్, 6000, బ్లాక్ బస్టర్ రకాల బీర్లను విడుదల చేసినట్లు సమాచారం. సాధారణంగా స్టాంగ్ బీర్లు తాగితే కడుపులో మంట, తలనొప్పి, హాంగ్ ఓవర్ సమస్యలు వస్తున్నాయని.. అందుకే లైట్ బీర్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడిందని అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు లైట్ బీర్ల కొరత వల్ల మందుబాబులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలంలో హ్యాపీగా చిల్డ్ కాలేకపోతున్నాయి బాధపడుతున్నారు.

Show comments