iDreamPost
android-app
ios-app

హర్ష సాయి ఎక్కడ..? పోలీసులకు ఎందుకు చిక్కడం లేదు..?

పది మందికి సాయం చేస్తూ పాపులర్ అయిన యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచార ఆరోపణలతో కేసు నమోదైన సంగతి విదితమే. అప్పటి నుండి కనిపించకుండా పోయిన హర్ష సాయి ఎక్కడ.? పోలీసులకు ఎందుకు చిక్కడం లేదంటే..?

పది మందికి సాయం చేస్తూ పాపులర్ అయిన యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచార ఆరోపణలతో కేసు నమోదైన సంగతి విదితమే. అప్పటి నుండి కనిపించకుండా పోయిన హర్ష సాయి ఎక్కడ.? పోలీసులకు ఎందుకు చిక్కడం లేదంటే..?

హర్ష సాయి ఎక్కడ..? పోలీసులకు ఎందుకు చిక్కడం లేదు..?

హర్షసాయి అంటే తెలియని నెటిజన్స్ లేరు. మంచితనం, మానవత్వం, దయాగుణం వంటి ట్యాగ్ తగిలించుకున్న సోషల్ మీడియా ఇన్ష్లుయెన్సర్. చాలా మందికి అతడో రియల్ హీరో. నేడు అత్యాచార ఆరోపణలతో విలన్ అయ్యాడు. ప్రేమ పేరుతో ఓ మహిళను వంచించి నయ వంచకుడయ్యాడు. అతడిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఐదు రోజుల క్రితమే ఫిర్యాదు చేసింది బాధితురాలు. మూవీ డిస్కర్షన్ చేయాలంటూ ఇంటికి పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాగే వీడియో రికార్డు చేసి బ్లాక్ బెయిల్ చేస్తున్నాడంటూ కంప్లయింట్ చేసింది. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆనాటి నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు ఈ యూట్యూబర్. దీంతో హర్షసాయి ఎక్కడ అనే ప్రశ్న మొదలౌతుంది. అతడి కేసు ఫైల్ దాదాపు వారం రోజులు గడుస్తున్నా.. అతడిని పట్టుకోలేకపోయారు పోలీసులు.

ఆడియో లీకులు, పోస్టులతో సోషల్ మీడియాతో టచ్‌లో ఉంటున్న హర్షసాయిని క్యాచ్ చేయలేకపోవడం, కేసు డిలే కావడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. హర్షసాయిని పట్టుకునేందుకు పోలీసులు జాప్యం చేస్తున్నారా అని కొంత మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినా.. ఎందుకు అతడు దొరకట్లేదని గుసగుసలాడుకుంటున్నారు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను ఇట్టే పట్టేసిన అదే నార్సింగి పోలీసులు.. హర్షసాయిని  పట్టుకోవడం కష్టమేమీ కాదు.. కానీ ఎందుకు పట్టుకోలేకపోతున్నారో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. అంతలో అతడు విదేశాలకు చెక్కేందుకు ప్లానులో ఉన్నాడని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఇదే నిజమైతే.. అతడు చిక్కడం కష్టమే. కలుగులో ఉన్న ఎలుకను బయటకు తెచ్చేందుకు ఎంతో టెక్నాలజీ ఉన్నా.. పోలీసులు సరైన రీతిలో వినియోగించుకోవడం లేదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

ఇదిలా ఉంటే..హర్షసాయి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.  బెట్టింగ్ యాప్స్ వివాదాల డొంక మళ్లీ కదులుతోంది. అతడిపై ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. గేమ్ యాక్టింగ్ ను ఉల్లంఘించారని హర్షసాయిపై తెలంగాణ డీజీపికి కంప్లైంట్స్ అందుతున్నాయి. ఇదే కాదు.. అటు ఏపీలో కూడా బాధితులు క్యూ కడుతున్నారు. అతడు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల ఇళ్లు, ఒళ్లు గుళ్ల చేసుకున్నామని, ఆర్థికంగా నష్టపోయామని, అప్పుల పాలయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. హర్షసాయి మాత్రమే కాదు.. సగం నేరాన్ని పంచుకున్న అతడి తండ్రి కూడా పరారీలోనే ఉన్నాడు. ఫ్యామిలీ మొత్తం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే.. హర్షసాయి తనపై వస్తున్న ఆరోపణలు కొట్టివేస్తున్నాడు. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ట్వీట్ చేసి.. అడ్వకేట్‌ను రంగంలోకి దింపాడు. మరీ ఎప్పుడు హర్షసాయి బయటకు వస్తాడో? ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో చూద్దాం.