iDreamPost
android-app
ios-app

ఈ వెల్డింగ్‌ వర్కర్‌ టాలెంట్‌ చూస్తే ఆశ్చర్యపోతారు.. సొంతంగా ఎలక్ట్రిక్‌ ట్రాలీ తయారీ

  • Published May 04, 2024 | 12:03 PM Updated Updated May 04, 2024 | 12:03 PM

ఇటీవల కాలంలో చాలామంది నూతన ఆలోచనలు చేయడం, ఆ ఆలోచనలకు బీజం వేసి ఎన్నో అద్భుతాలు సృష్టించడం చాలానే చూస్తున్నాం. ఈ క్రమంలోనే తాజాగా హనుమకొండ జిల్లాలోని ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఇంతకి అదేమిటంటే..

ఇటీవల కాలంలో చాలామంది నూతన ఆలోచనలు చేయడం, ఆ ఆలోచనలకు బీజం వేసి ఎన్నో అద్భుతాలు సృష్టించడం చాలానే చూస్తున్నాం. ఈ క్రమంలోనే తాజాగా హనుమకొండ జిల్లాలోని ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఇంతకి అదేమిటంటే..

  • Published May 04, 2024 | 12:03 PMUpdated May 04, 2024 | 12:03 PM
ఈ వెల్డింగ్‌ వర్కర్‌ టాలెంట్‌ చూస్తే ఆశ్చర్యపోతారు.. సొంతంగా ఎలక్ట్రిక్‌ ట్రాలీ తయారీ

ఈరోజుల్లో బుర్రకు కాస్త పదును పెడితే చాలు ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఏదైనా వినూత్నంగా ఆలోచించి కృషి చేస్తే చాలు.. అసాధ్యమైనది కూడా సాధ్యమయ్యేలా చేయవచ్చు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేది అందుబాటులోకి వచ్చింది. ఇక దానిని ఉపాయోగించి, తెలివిగా చాలామంది కొత్త కొత్త ఆలోచనలు, ప్లాన్స్ చేస్తూ రకరకాల పరికారలకు రూపకల్పన చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ పరికరాలు అనేవి తక్కువ బడ్జెట్ లో ఆవిష్కరణ చేయడం అనేది మరొక విశేషం. కనుక కొత్త ఆలోచనలు, చేయడం, ఆ ఆలోచనలకు బీజం వేయడం అనేది ఎప్పుడు తప్పు కాదు. ఈ క్రమంలోనే తాజాగా హనుమకొండ జిల్లాలోని ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఇంతకి అదేమిటంటే..

ఇటీవల కాలంలో చాలామంది నూతన ఆలోచనలతో ఎన్నో అద్భుతాలనే సృష్టిస్తున్నారు. పనికిరాని వస్తువులను సైతం ఓ కొత్త పరికరంలా తీర్చిదిద్ది అవసరమయ్యే వస్తువుగా మారస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హనుమకొండ జిల్లాకు చెందిన మహిపాల్ చారి అనే వెడ్డింగ్ వర్కర్ కూడా వినూత్నంగా ఆలోచించి ఓ కొత్త అద్భుతాన్ని ఆవిష్కరించాడు. అయితే ఇప్పటి వరకు మనం పెట్రోల్‌, డీజిల్‌ ధరల నుంచి విముక్తి కలిగించేందుకు విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రికల్ స్కూటర్, ఎలక్ట్రికల్ బైక్ ను మాత్రమే చూసి ఉంటాం. కానీ, తాజాగా ఆ మహిపాలు అనే వెల్డర్ కొత్తగా ఎలక్ట్రికల్ ట్రాలీని తయారుచేశాడు. కాగా, ఈ ఎలక్ట్రిక్ ట్రాలీకి కేవలం నాలుగు బ్యాటరీల సాయంతో తయారు చేశాడు. అలాగే దీనికి వెయ్యి వాట్ల సామర్థ్యం గల మోటారు బిగించించాడు. వీటితో పాాటు మూడు టైర్లును అమర్చి చిన్న ట్రాలీ వచ్చే విధంగా రూపొందించాడు. అంతేకాకుండా.. ముందుకి డ్రైవర్ పక్కనే మరో ఇద్దరు కూర్చునేందుకు సీటింగ్ ఏర్పాటు చేశాడు. అయితే ఈ ఎలక్ట్రిక్ ట్రాలీని నాలుగు గంటల పాటు ఛార్జ్ చేస్తే చాలు.. 70 నుంచి 80 కిలో మీటర్ల వరకు ప్రయాణిస్తుందని ఆ వ్యక్తి తెలిపాడు. కాగా ఇది సుమారుగా 500 కేజీల వరకు బరువును ఈజీగా మోస్తుందని వెల్లడించాడు.

ఇకపోతే ఈ వాహనాన్ని రైతులకు, పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులకు ఉపయోగపడేలా తయారు చేసినట్లు మహిపాలు వెల్లడించారు. అయితే రైతులు తక్కువ ఖర్చుతో పంట ఉత్పత్తులు తరలించేందుకు ఈ ట్రాలీ ఆటో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అలాగే మార్కెట్లలో పనిచేసే రిక్షా కార్మికులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని అని తెలిపారు. ఇక ఈ ఎలక్ట్రిక్ ట్రాలీ ఎలక్ట్రిక్‌ ట్రాలీ వాహనాలు కావలసినవారు తనను సంప్రదిస్తే వారంలో తయారుచేసి ఇస్తానని.. రెండేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా రిపేర్‌ చేస్తానని మహిపాల్‌ చెబుతున్నారు. అయితే మహిపాల్ గతంలో కూడా వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలను తయారుచేసి రాష్ట్రపతి చేతులు మీదగా అందుకున్నారు. మరి, మహిపాల్ అనే వెల్డర్  రైతులకు, రిక్షా కార్మికులకు, వివిధ రకాలుగా ఉపాయోగపడే ఎలక్ట్రికల్ ట్రాలీ అవిష్కరించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.