రానున్న 5 రోజులు అతి భారీ వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల్లో..

IMD Issues Heavy Rains in Telangana: గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పూర్తిగా కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. మరో ఐదు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

IMD Issues Heavy Rains in Telangana: గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పూర్తిగా కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. మరో ఐదు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు జలాశయాలు, కాల్వలు, చెరువులు నిండుకుండలా మారాయి. పలు ప్రాంతాల్లో వరదల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇది చాలదు అన్నట్టు ఇప్పడు మళ్లీ తెలంగాణలో మరో ఐదురోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాదు వివిధ జిల్లాలకు పింక్, రెడ్, గ్రీన్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ చెబుతుంది. వివరాల్లోకి వెళితే..

(04-09-2024): కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలక ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది.

(05-09-2024): జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం,మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు 30-40 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Show comments