iDreamPost
android-app
ios-app

HYDలో ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్.. ఎప్పటివరకు అంటే?

  • Published Sep 23, 2024 | 11:00 AM Updated Updated Sep 23, 2024 | 11:00 AM

హైదరాబాద్ నగరవాసులకు తాజాగా ఓ పిడుగు లాంటి వార్త అందింది. నేడు నగరంలో ఈ ప్రాంతాల్లో మరో 24 గంటల పాటు నీళ్ల సరఫరా బంద్ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్ నగరవాసులకు తాజాగా ఓ పిడుగు లాంటి వార్త అందింది. నేడు నగరంలో ఈ ప్రాంతాల్లో మరో 24 గంటల పాటు నీళ్ల సరఫరా బంద్ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

  • Published Sep 23, 2024 | 11:00 AMUpdated Sep 23, 2024 | 11:00 AM
HYDలో ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్.. ఎప్పటివరకు అంటే?

హైదరాబాద్ మహా నగరంలో తరుచు నీళ్ల కొరత సమస్య అనేది అద్దం పట్టినట్లుగా కనిపిస్తోంటుంది. పైగా పేరకే పెద్ద నగరం కానీ, ఇక్కడ నగరవాసులకు సరిపడా నీటి మౌలిక సదుపాయాలు తక్కువగా ఉంటాయనే చెప్పవచ్చు. దీంతో ఎప్పుడు హైదరాబాద్ నగరంలో నీటి సమస్య అనేది ప్రజలకు వెంటాడుతునే ఉంటుంది. ముఖ్యంగా నగరంలోకొన్ని ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు లీకేజీ సమస్యలు వస్తునే ఉంటాయి. దీంతో  సక్రమంగా నీరు సరాఫరా రాక నగరవాసులు అల్లడిపోతుంటారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నగరవాసులకు ఓ పిడుగు లాంటి వార్త అందింది. హైదరాబాద్ నగరంలో ఈ ప్రాంతల్లో మరో 24 గంటల పాటు నీళ్ల సరఫరా బంద్ నిలిపివేస్తున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో నేడు సోమవారం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీనరేజ్ బోర్డ్ తాజాగా ప్రకటించింది. అయితే కృష్ణా ఫేజ్‌-3 రింగ్‌ మెయిన్‌ 1 కింద ప్రశాసన్‌ నగర్‌, అయ్యప్ప సొసైటీ మధ్య మంచి నీటి సరఫరా చేసే ప్రధాన పైపులైన్‌ పలు ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్పడిందని, ఈ కారణంతోనే పలు ప్రాాంతాల్లో మరో 24 గంటల పాటు నీటి సరఫరా బంద్ చేసినట్లు అధికారలు తెలిపారు. ఈ మేరకు హకీంపేట, గోల్కండ, టోలీచౌక్, లంగర్ హౌజ్, షేక్ పేట, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, తాటి ఖానా, కొండాపూర్, డోయెన్స్ కాలనీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో నేడు మంచి నీటి సరఫరా ఉండదని అధికారులు ప్రకటించారు.

అలాగే ప్రశాసన్‌నగర్‌ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు 1200 డయా పీఎస్‌పీ గ్రావిటీ మెయిన్‌ పైప్‌లైన్‌ కూడా చాలా చోట్ల లీకేజీలు ఏర్పడినట్లు పేర్కొన్నారు. దీంతో ఆయా పైపులైన్లను కూడా నేడు మరమ్మతులు చేపడతామని చెప్పారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం 6.00 గంటల నుంచి 24 గంటల పాటు అంటే మంగళవారం ఉదయం వరకు మరమ్మతు పనులు కొనసాగుతాయని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీనరేజ్ బోర్డ్ స్పష్టం చేసింది. ఇక ఆయా ప్రాంతాల్లో కూడా ప్రజలు మంచినీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని వాటర్ వర్క్ అధికారులు సూచించారు. మళ్లీ యదావిధిగానే మంగళవారం ఉదయం నుంచి నీటి సరఫరా ఉంటుందని తెలిపారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. మరి, నగరంలో 24 గంటల పాటు పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్ చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.