Dharani
ఆ దంపతుల మధ్య పెళ్లైన నాటి నుంచి సఖ్యత లేదు. పిల్లలను కూడా సరిగా పట్టించుకునేవారు కాదు.. ఆఖరికి అనారోగ్యంతో బాధపడుతున్న వారి గురించి ఆలోచించకుండా దారుణానికి ఓడిగట్టారు. ఆ వివరాలు..
ఆ దంపతుల మధ్య పెళ్లైన నాటి నుంచి సఖ్యత లేదు. పిల్లలను కూడా సరిగా పట్టించుకునేవారు కాదు.. ఆఖరికి అనారోగ్యంతో బాధపడుతున్న వారి గురించి ఆలోచించకుండా దారుణానికి ఓడిగట్టారు. ఆ వివరాలు..
Dharani
పెళ్లైన దగ్గర నుంచి ఆ దంపతుల మధ్య సఖ్యత లేదు. నిత్యం గొడవలు, అనుమానాలతోనే వారి కాపురం సాగింది. పెళ్లై 15 సంవత్సరాలకు పైగా అవుతోంది. ముగ్గురు పిల్లలు సంతానం. భార్యాభర్తలకు నిత్యం గొడవలతోనే సరిపోయేది. కనీసం పిల్లలకు సరైన తిండి కూడా పెట్టేవారు కాదు. ఇరు వైపుల పెద్దలు ఎంత ప్రయత్నించినా వారి మధ్య సఖ్యత కుదరలేదు. ఈ క్రమంలో తాజాగా దారుణం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు పిల్లలను సరిగా పట్టించుకోని తల్లిదండ్రలు ఆఖరికి దారుణానికి ఒడిగట్టారు. ఆ పిల్లల దయనీయ పరిస్థితి చూసి ప్రతి ఒక్కరు కన్నీరు పెడుతున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే..
తమ స్వార్థం కోసం భార్యాభర్తలు గొడవపడ్డారు. ఆ ఆవేశంలో భర్త.. భార్యను చంపి.. ఆ తర్వాత ఆత్యహత్య చేసుకున్నాడు. దాంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. ఈ విషాదకర సంఘటన వరంగల్, లేబర్‌కాలనీ (చెన్నారెడ్డి కాలనీ)లో చోటు చేసుకుంది. మంగళవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. మంద చరణ్ అలియాస్ చేరాలు(45) అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం స్వప్న(40)తో వివాహం జరిగింది. చరణ్ భవన నిర్మాణ కార్మికుడిగా, స్వప్న ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు గ్రేసీ, మెర్సీ, కుమారుడు షాలోమ్ ఉన్నారు. ఇక పెళ్లైన నాటి నుంచి భార్యాభర్తల మధ్య సఖ్యత సరిగా లేదు. నిత్యం గొడవ పడుతుండే వారు. ఈ క్రమంలో తాజాగా సోమవారం నాడు దారుణం చోటు చేసుకుంది.
భార్యాభర్తల గొడవల కారణంగా చరణ్.. గత మూడు నెలలుగా ఇంటికి దూరంగా ఉంటున్నాడు. సోమవారం ఇంటికి వచ్చిన చరణ్.. ప్లాన్ ప్రకారం.. పిల్లలను వరంగల్ ఉర్సు ప్రాంతంలోని స్వప్న పుట్టింటి వద్ద వదిలి వచ్చాడు. రాత్రి తిరిగి వచ్చాక భార్యతో గొడవపడ్డాడు. ఆ ఆవేశంలో రోకలిబండతో ఆమెని కొట్టి చంపాడు. అనంతరం గదిలో ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు పట్టుబడతానన్న భయంతో మంగళవారం ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు చరణ్.
ఇక మంగళవారం ఉదయం ఉర్సు నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు, తల్లిదండ్రులు విగతజీవులుగా పడి ఉండటం చూశారు. తల్లిదండ్రులను ఆ స్థితిలో చూసిన పిల్లలు.. భయంతో ఏడ్చారు. దాంతో స్థానికులు చరణ్ ఇంటి వద్దకు చేరుకుని.. 100కు డయల్ చేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వారి మృతదేహాలను ఎంజీఎం ఆసుపత్రికి తరంలించారు. భార్యాభర్తల మృతితో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. తల్లిదండ్రులను కోల్పోయిన దయనీయ పరిస్థితిలో ఉన్న పిల్లలను చూసి చలించిన సీఐ మల్లయ్య ముగ్గురు పిల్లలకు ఇంటర్మీడియట్ వరకు చదువు చెప్పించే బాధ్యతను తీసుకుంటానని ప్రకటించారు. స్వప్న సోదరుడు సారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
భార్యాభర్తలిద్దరూ నిత్యం గొడవపడేవారు. పిల్లలను సరిగా పట్టించుకునే వారు కాదు. వారికి సరైన తిండి కూడా పెట్టేవారు కాదు. ఇక వీరిలో చిన్నమ్మాయికి మెర్సీకి గుండె సంబంధిత వ్యాధి ఉండగా, కుమారుడు షాలోమ్‌కు కళ్లు కనిపించవు. తల్లిదండ్రులు సఖ్యతగా లేకపోవడం మూలంగా వారికి సరైన వైద్యం కూడా కరవైంది. తమను సరిగ్గా చూడకపోయినా, గతంలో మూడుసార్లు ఆత్మహత్యకు యత్నించిన తండ్రిని కాపాడుకున్న పిల్లలు ఈసారి ఓడిపోయారు. ముగ్గురు పిల్లలను అనాథలుగా చేసి.. తమ స్వార్థం చూసుకున్న తల్లిదండ్రుల తీరుపై ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.