Vikarabad: కదిలే ట్రైన్‌ ఎక్కబోయి రైల్వే ట్రాక్‌ మధ్యలో ఇరుక్కుని

చాలా మంది హడావుడిగా కదులుతున్న రైలు, బస్సుల్లో ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో ప్రమాదం బారిన పడుతుంటారు. తాజాగా వికారాబాద్ రైల్వే స్టేషన్ లో కూడా ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది.

చాలా మంది హడావుడిగా కదులుతున్న రైలు, బస్సుల్లో ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో ప్రమాదం బారిన పడుతుంటారు. తాజాగా వికారాబాద్ రైల్వే స్టేషన్ లో కూడా ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది.

వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. కదిలే రైలు ఎక్కబోయిన ఓ వ్యక్తి జారి పడి.. రైలు.. ఫ్లాట్ మధ్య ఇరుక్కుపోయాడు. దీంతో రైలు అతడ్ని కొంత దూరం మేర లాక్కెళ్లిపోయింది. గమనించిన తోటి ప్రయాణీకులు.. వెంటనే చైన్ లాగడంతో.. ఆ రెండింటి మధ్య విలవిలాడుతున్న ప్రయాణికుడ్ని.. రైల్వే సిబ్బంది రక్షించారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అతడికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి 11.30 గంటలకు చోటుచేసుకుంది.  వికారాబాద్ నుండి యశ్వంత్ పూర్ రైలు బయలు దేరుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అతడికి వికారాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే యోచనలో ఉన్నారు అధికారులు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో యశ్వంత్ పూర్ రైలు అప్పటి కదిలిపోయింది. దీంతో ఓ ప్రయాణీకుడు హడావుడిగా ఆ మూవింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. అంతలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అతడు కాలి జారి రైలు, ఫ్లాట్ మధ్య ఇరుక్కుపోయాడు. రైలు అతడిని లాక్కొంటూ కొంత దూరం వెళ్లిపోయింది. వెంటనే గమనించిన ప్రయాణీకులు.. ట్రైన్ చైన్ లాగడంతో బండి ఆగిపోయింది. అప్పటికే గాయాలతో విలవిలలాడిపోయాడు ప్రయాణీకుడు. అయితే కింద భాగం వరకు రైలు, ఫ్లాట్ ఫాం మధ్య ఇరుక్కు పోవడంతో రైల్వే సిబ్బంది.. ఫ్లాట్ ఫాం పగులకొట్టి అతడ్ని బయటకు తీశారు. అనంతరం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Show comments