iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్.. గాల్లో ఎగరనున్న హైదరాబాద్ జనాలు.. సిటీలో ఎయిర్ ట్యాక్సీలు

  • Published May 18, 2024 | 9:34 PM Updated Updated May 18, 2024 | 9:34 PM

రోడ్లపై భారీ ట్రాఫిక్ లో జర్నీ చేసి విసిగిపోయే వారికి బిగ్ రిలీఫ్. హైదరాబాద్ నగరంలో ఎయిర్ ట్యాక్సీలు రాబోతున్నాయి. త్వరలోనే జనాలు గాల్లో ఎగరనున్నారు. గాల్లోనే ఆఫీసులకు వెళ్లనున్నారు. అంతేనా ఎయిర్ అంబులెన్స్ లు కూడా రానున్నాయి. ఇవి వస్తే చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చు.

రోడ్లపై భారీ ట్రాఫిక్ లో జర్నీ చేసి విసిగిపోయే వారికి బిగ్ రిలీఫ్. హైదరాబాద్ నగరంలో ఎయిర్ ట్యాక్సీలు రాబోతున్నాయి. త్వరలోనే జనాలు గాల్లో ఎగరనున్నారు. గాల్లోనే ఆఫీసులకు వెళ్లనున్నారు. అంతేనా ఎయిర్ అంబులెన్స్ లు కూడా రానున్నాయి. ఇవి వస్తే చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చు.

గుడ్ న్యూస్.. గాల్లో ఎగరనున్న హైదరాబాద్ జనాలు.. సిటీలో ఎయిర్ ట్యాక్సీలు

దేశంలో ట్రాఫిక్ పెరిగిపోతుంది. జనాభా పెరిగిపోవడం, వాహనదారులు పెరిగిపోవడంతో నగర రోడ్లు ఎప్పుడూ రద్దీగానే ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో త్వరగా ఆఫీసులకు చేరుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు పలు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఎయిర్ ట్యాక్సీలను తయారు చేసి టెస్టింగ్ చేస్తున్నాయి. వీలైనంత త్వరగా ఈ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాయి. దేశంలోని ఢిల్లీ, గురుగ్రాం నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఇదిలా ఉంటే హైదరాబాద్ కి చెందిన ‘డ్రోగో డ్రోన్స్’ అనే డ్రోన్ టెక్ స్టార్టప్ కంపెనీ హైదరాబాద్ లో ఎయిర్ ట్యాక్సీలను నడపాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకు సంబంధించిన సాంకేతిక పనులు బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతున్నాయని డ్రోగో డ్రోన్స్ కంపెనీ సహ వ్యవస్థాపకులు శ్రీధర్ దన్నపనేని వెల్లడించారు. కమర్షియల్ ఎయిర్ ట్యాక్సీలను నడపడానికి సిద్ధంగా ఉన్నామని.. ఈ ప్రాజెక్టుతో గ్రేటర్ హైదరాబాద్ లో ఎయిర్ ట్యాక్సీల్లో ప్రయాణం చేస్తారని అన్నారు. ఆటోలు, క్యాబ్ లు ఎక్కినట్టే ఈ డ్రోన్ ట్యాక్సీల్లో ఎక్కి కూర్చొని ప్రయాణం చేయవచ్చునని అన్నారు. అలానే సిటీలో ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ఈ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తామని సీఈఓ యశ్వంత్ తెలిపారు. అత్యవసర మెడికల్ సేవలను అందించేందుకు కృషి 3 డ్రోన్ కి డీజీసీఏ అప్రూవల్ కూడా వచ్చిందని అన్నారు.  

ఇప్పటికే ఈ కంపెనీ అగ్రి డ్రోన్లపై ఫోకస్ పెట్టిందని.. తమ కంపెనీ డ్రోన్స్ తో వ్యవసాయరంగానికి సేవలు అందిస్తున్నామని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, కేరళ, కర్ణాటక సహా దేశంలో వివిధ రాష్ట్రాల్లో 30 లక్షల ఎకరాల్లో పంటలపై పురుగు మందు స్ప్రే చేసే డ్రోన్స్ ని సప్లై చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. వ్యవసాయ రంగంలో మరింత ప్రభావితమైన సేవలను అందించేందుకు కృషి 3 డ్రోన్లకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి పర్మిషన్ కూడా వచ్చిందని సీఈఓ యశ్వంత్ తెలిపారు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఈ డ్రోన్ 4 ఎకరాల్లో పురుగుల మందు పిచికారి చేస్తుందని అన్నారు. ఫుల్ ఛార్జ్ లో ఉన్న ఈ డ్రోన్ గాల్లో 24 నిమిషాలు ఉండగలదని అన్నారు. 

హైదరాబాద్ డ్రోన్ టెక్ కంపెనీ ఈ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తే ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడినట్టు అవుతుంది. మరోవైపు ఈ ఎయిర్ ట్యాక్సీలను ఎయిర్ అంబులెన్స్ ల కింద వాడితే ట్రాఫిక్  లో చిక్కుకోకుండా పేషెంట్ ని త్వరగా ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడవచ్చు. ఈ ఎయిర్ ట్యాక్సీలను ఎయిర్ అంబులెన్స్ లుగా వాడేందుకు ప్రభుత్వం ఏమైనా చొరవ తీసుకుంటే ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని నిమిషాల్లో ఆసుపత్రికి చేర్చవచ్చు. మరి దీనిపై మీరేమంటారు?