శునకం ధ‌ర రూ. 20 కోట్లు.. దీని ప్ర‌త్యేక‌త‌లు ఏంటంటే..?

సాధారణంగా కొన్ని జాతి కుక్కలకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. రేర్ గా కనిపించే జాతి కుక్కలను తమ సొంతం చేసుకోవడానికి జంతుప్రేమికులు ఎంతగానో ఇష్టపడుతుంటారు.

సాధారణంగా కొన్ని జాతి కుక్కలకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. రేర్ గా కనిపించే జాతి కుక్కలను తమ సొంతం చేసుకోవడానికి జంతుప్రేమికులు ఎంతగానో ఇష్టపడుతుంటారు.

పెంపుడు జంతువులంటే మొదటిగా గుర్తొచ్చేవి శునకాలు. మనుషులకు అనాధిగా అత్యంత సన్నిహితంగా ఉంటు వస్తున్నాయి శునకాలు. ఇవి ఎంతో విశ్వాసమైనవే కాదు.. ఇంటికి కాపలాగా ఉంటుంది. ఎవరైనా అపరిచితులు కనిపిస్తే గట్టిగా అరుస్తూ తమ యజమానిని అలర్ట్ చేస్తుంది.  ఈమద్య కాలంలో శునకాలను తమ సొంత బిడ్డలా చూసుకుంటున్నారు.  వీటికోసం ప్రత్యేకమైన వసతులను ఏర్పాటు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. శునక జాతుల్లో అనేక రకాల ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో జాతి శునకాలంటే అభిమానం ఉంటుంది. అలాగే ఈ జాతి శునకాలు చాలా ఖరీదు కూడా ఉంటాయి. తాజాగా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన జాతి శునకం ఒకటి హైదరాబాద్ లో సందడి చేసింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ మియాపూర్ లో ఓ ఖరీదైన శునకం సందడి చేస్తుంది.  దీని విలువ 20కోట్లు అని దాని యజమాని తెలియజేశారు. ఈ అరుదైన శునకం కాకసియాన్ షెఫర్డ్ జాతికి చెందింది. ఈ శునకాన్ని బెంగుళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్.. సతీష్ హైదరాబాద్ కు తీసుకుని వచ్చారు. మియాపూర్ లోని మదీనాగూడలో గల విశ్వాస్ పెట్ క్లినిక్‌ లో ఈ డాగ్ సందడి చేసింది. ఈ శునకం వయస్సు కేవలం మూడు సంవత్సరాలు. ఇంకా ఇది రోజుకి మూడు కేజీల చికెన్ ను ఆహారంగా తీసుకుంటుందట. ఇక ఈ డాగ్ మెయింటినెన్స్‌కు‌ నెలకు మూడు లక్షల వరకు ఖర్చు అవుతుందని దీని యజమాని తెలిపారు. పైగా.. ఈ శునకానికి ఓ సెలబ్రిటీకి ఉన్నట్టు ప్రత్యేకమైన బిజీ షెడ్యూల్ కూడా ఉంది.

సినిమాలు, ప్రదర్శనలు, పెద్ద పెద్ద వేడుకలు, న్యూస్ చానెల్స్ లో ఇంటర్వ్యూలు ఇలా ఎప్పుడు ఈ శునకం బిజీగా ఉటుందట. ఈ స్పెషల్ డాగ్ పేరు కెటబామ్స్ హైడర్. ఈ అరుదైన జాతిని రష్యా నుంచి దిగుమతి చేశారని సతీష్ తెలిపారు. కాగా, ఈ శునకం ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రదర్శనలు ఇచ్చిందట. ఇంకా కొన్ని సినిమాలలోనూ హైడర్ నటించిందని.. వేల సంఖ్యలో పలు న్యూస్ చానెల్స్ లో, స్టోరీలలో వచ్చిందని.. సతీష్ చెప్పుకొచ్చారు. ఇక ఈ బ్రీడ్ విషయానికి వస్తే.. ఇవి దక్షిణ రష్యాలోని ఆర్మేనియా, అజర్‌బైజాన్, జార్జియాలతో పాటు టర్కీలో కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్రీడ్ డాగ్స్ చూసేందుకు ఆడసింహాల కనిపిస్తూ ఉండడమే వీటి ప్రత్యేకత.

మరోవైపు ఈ డాగ్ ను హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశాడనే వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలను సతీష్ పూర్తిగా ఖండించారు. వంద కోట్లు ఇచ్చినా తన కుక్కను ఎవరికీ అమ్మేది లేదని తేల్చిచెప్పారు. ఇక ఈ శునకం గురించి తెలుసుకున్న తర్వాత.. దీని ఓ నెల ఖర్చుతో ఓ మధ్య తరగతి కుటుంబం.. కనీసం రెండు నెలలైనా లగ్జరీగా బ్రతికేయొచ్చేమో అనిపిస్తుంది. ఏదేమైనా ఇటువంటి జాతి శునకాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ స్పెషల్ డాగ్ అయిన కెటబామ్స్ హైడర్ మియాపూర్ లో సందడి చేయడంతో.. జనం దీనితో సెల్ఫీలు దిగడానికి తెగ పోటీ పడ్డారు. మరి ఈ ఖరీదైన, అరుదైన శునకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments