P Venkatesh
నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు. ఆయన బర్త్ డే వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమైపోయారు. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ అందించింది బీఆర్ఎస్ పార్టీ.
నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు. ఆయన బర్త్ డే వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమైపోయారు. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ అందించింది బీఆర్ఎస్ పార్టీ.
P Venkatesh
గులాబీ దళపతి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఏడు పదుల వయసులోకి అడుగుపెడుతున్నారు. నేడు కేసీఆర్ బర్త్ డే వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిపేందుకు పార్టీ శ్రేణులు, నాయకులు సిద్ధమైపోయారు. రాష్ట్రంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కేసీఆర్ అభిమానులు పుట్టిన రోజు వేడుకలను జరుపనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు శుభవార్తను అందించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డేని పురస్కరించుకుని ఆటో డ్రైవర్లకు విలువైన బహుమతిని అందించేందుకు సిద్ధమైపోయింది. ఇంతకీ ఏమివ్వనున్నారంటే?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకునే ఆటోడ్రైవర్ల నెత్తిన పిడుగు పడినట్లైంది. ప్యాసింజర్లు లేక, కిస్తీలు కట్టలేక పలువురు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారికి అండగా ఉండేందుకు, బీఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దాదాపు 1000 మంది ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా కల్పించి బహుమతిగా ఇవ్వాలని భావిస్తోంది.
ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి లక్ష రూపాయల ప్రమాద బీమా కవరేజీ కల్పించనున్నట్టు బీఆర్ఎస్ నేత టి సాయి కిరణ్ వెల్లడించారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో సుమారు 100 కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నది. ఇదే గాక వికలాంగులకు వీల్ చైర్ లను అందజేస్తున్నామని ఆయన చెప్పారు. ఇక నేడు కేసీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తధాన శిబిరాలు, మొక్కలు నాటడం, అనాథలకు సాయం అందించడం, కేక్ కటింగ్ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీ అయిపోయాయి. మరి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా కల్పించడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.