iDreamPost
android-app
ios-app

తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం.. వీహెచ్‌ సంచలన వ్యాఖ్యలు

  • Published Oct 23, 2023 | 11:21 AM Updated Updated Oct 23, 2023 | 11:21 AM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార పార్టీ, ప్రతిపక్షలు తమ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేస్తూ ప్రచారాలకు శ్రీకారం చుట్టారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార పార్టీ, ప్రతిపక్షలు తమ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేస్తూ ప్రచారాలకు శ్రీకారం చుట్టారు.

  • Published Oct 23, 2023 | 11:21 AMUpdated Oct 23, 2023 | 11:21 AM
తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం.. వీహెచ్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగిపోతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ షెడ్యూల్ రాకముందే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందె. ఈ మద్యనే బీ-ఫారాలు స్వయంగా కేసీఆర్ అభ్యర్థులకు అందజేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మేల్యే అభ్యర్థుల విషయంలో అధిష్టానం కీలక చర్చలు జరిపిన తర్వాత 55 మంది లీస్ట్ రిలీజ్ చేశారు. మొదటి జాబితాలో కీలక నిజయోకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు చేయలేదు. దీంతో ఎవరికి సీట్లు దక్కుతాయో అనేదానిపై రక రకాల చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే…

తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన తర్వాత ప్రధాన పార్టీలు రంగంలోకి దూకి ప్రచారాల్లో దుమ్మురేపుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ తమ ఎమ్మెల్యే అభ్యర్థులను ఖారారు చేసి ఆయా నిజయవర్గాల్లో ముమ్మర ప్రచారాలు చేస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు 55 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మాత్రమే రిలీజ్ చేసింది. నిన్న ఆదివారం బీజేపీ 52 మంది ఎమ్మెల్యే అభ్యర్థు జాబితా రిలీజ్ చేసింది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ ముసలం మొదలైందని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు తన నివాసంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబర్ పేట నియోజకవర్గంలో కావాలని రాద్దాంతం సృష్టిస్తున్నారని.. అది తన నిజయోకవర్గం, గతంలో ఇక్కడ నుంచి గెలిచి మంత్రినయ్యానని గుర్తు చేశారు.

వీ.హనుమంత రావు మాట్లాడుతూ.. ‘నేను కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో విధేయుడిగా ఉంటూ వస్తున్నాను. కానీ కొంతమంది నన్ను కాంగ్రెస్ నుంచి బయటకు పంపించేందుకు రక రకాల కుట్రలు పన్నుతున్నారు. అంబర్ పేట్ నియోజకవర్గంలో నాకు ఎంతో మంచి పట్టు ఉంది.. గతంలో ఇక్కడ నుంచి గెలిచి మంత్రినయ్యాను. ఇప్పుడు అంబర్ పేట్ టికెట్ కి సంబంధించిన ప్రపోజల్ రేవంత్ రెడ్డి ముందు ఉంచితే.. దానికి అడ్డు పడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తన నియోజకవర్గంలో వేరే వాళ్లు వేలు పెడితో ఊరుకునే ప్రసక్తే లేదు. గతంలో ఉత్తమ్.. నూతి శ్రీనివాస్ గౌడ్ ని రెచ్చగొట్టి నాపై కేసులు పెట్టించాడు. ఈసారి అంబర్ పేట్ వెంట పడుతున్నాడు.. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తా. ఉత్తమ్ కుమార్ తో పాటు ఆయన భార్యకు సీట్లు కావాలి.. మరి మాకు మాత్రం వద్దా? ఈ మధ్య నేను డబ్బులు తీసుకొని పోటీ నుంచి వెనక్కి తగ్గానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అది అంతా అబద్ధం అని మీడియా ముఖంగా చెబుతున్నాను.

ఉత్తమ్ కుమార్ దారుణమైన రాజకీయ కుట్రలకు పాల్పపడుతూ గతంలో నా మనుషులు ఏలేటి మహేష్ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డిని బయటకు పంపించారు. ఇప్పుడు నాతో పాటు జగ్గారెడ్డిని పార్టీ నుంచి పంపించేందుకు రక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అప్పట్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా జగ్గారెడ్డిని ఉసిగొలిపి దారుణంగా మాట్లాడించింది ఉత్తమే.. టీపీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని జగ్గారెడ్డిని నమ్మించి మోసం చేశాడు. సీట్ల విషయంలో బీసీలకు అన్యాయం అవుతుందని సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. ఉత్తమ్ కి బీసీల ఓట్లు కావాలి.. కానీ బీసీలకు మాత్రం సీట్లు ఇవ్వరా? బీసీ టికెట్ల విషయంలో కోమటిరెడ్డి కూడా మాట తప్పాడు. ఇక్కడ నుంచి బీసీ బిడ్డ లక్ష్మణ్ యాదవ్ కి కాంగ్రెస్ టికెట్ కావాలని అడుగుతున్నా.. గతంలో ఇక్కడ నుంచి యాదవులు గెలిచిన విషయం గుర్తుంచుకోవాలి. నేను గాంధీ కుటుంబానికి విధేయుడిని.. ఎప్పటికీ పార్టీ మారబోను. ఇక నుంచైనా ఉత్తమ్ తన బుద్ది మార్చుకోకపోతే.. ఆయన చేసిన పనులన్నీ బయటపెడతాను.. ఇది నా హెచ్చరిక అని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో సీట్ల విషయంలో కాంగ్రెస్ లో ఏర్పడుతున్న ముసలంపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ముందు ముందు చూడాలి.