Uttam Kumar Reddy: పెట్రోల్‌ బంకు ఓనర్స్‌కు మంత్రి ఉత్తమ్‌ హెచ్చరిక.. ఇకపై అలా చేస్తే

Uttam Kumar Reddy-Petrol Pumps: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. పెట్రోల్‌ బంకు యజమానులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఆ వివరాలు..

Uttam Kumar Reddy-Petrol Pumps: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. పెట్రోల్‌ బంకు యజమానులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎన్నికల హమీల అమలుతో పాటు ప్రజా సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. మరీ ముఖ్యంగా సమాజంలో పేరుకుపోయిన కల్తీ, అవినీతి, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడం కోసం హైడ్రా ఆయా రంగాలకు చెందిన వ్యవస్థలతో దూకుడుగా ముందుకు సాగుతూ.. అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఇప్పటికే ఆహార కల్తీని అరికట్టడం కోసం తెలంగాణ ఫుడ్‌సెఫ్టీ అధికారులు నగరంలోని అన్ని ప్రముఖ హోటల్లు, రెస్టారెంట్లలో సోదాలు నిర్వహిస్తూ.. కల్తీపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక నగరంలోని ఆక్రమణలపై హైడ్రా దూకుడుగా ముందుకు సాగుతుంది. ఇలా ఉండగా.. తాజాగా మంత్రి ఉత్తమ్‌.. పెట్రోల్‌ బంక్‌ యజమానులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఆ వివరాలు..

పెట్రోల్‌ బంకుల యజమానులకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. కారణం ఏంటంటే.. గత కొంత కాలంగా పెట్రోల్ బంకుల్లో మోసాలు ఎక్కువయ్యాయి. దాంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజీల్ కల్తీలకు పాల్పడటం, మీటర్ రీడింగుల్లో చిప్స్ అమర్చి తక్కువ పెట్రోల్ పోయటం వంటివి చేస్తుంటారు. అయితే ఇకపై ఇలాంటి ఆటలు సాగవు అంటున్నారు మంత్రి ఉత్తమ్‌. పెట్రోల్ బంక్ మోసాలపై తమ సర్కార్‌ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది అని తెలిపారు.

ఇకపై పెట్రోల్‌ బంకుల్లో మోసాలు జరిగితే సహించేది లేదని సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. తూనికలు, కొలతల శాఖపై మంగళవారం (ఆగస్టు 27) సెక్రటేరియట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి ఉత్తమ్‌. ఈ సందర్భంగా పెట్రోల్‌ బంకుల్లో మోసాలు అరికట్టేందుకు.. తనిఖీలను ముమ్మరం చేయాలని ఆశాఖ అధికారుల్ని ఆదేశించారు. సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తూ అక్రమాలకు పాల్పడేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. తక్కువ పెట్రోల్ పోయటం, టెక్నాలజీ సాయంతో చిప్స్ వంటివి అమర్చి సామాన్యుల జేబుకు గుల్ల చేయటం, పెట్రోల్, డీజిల్ కల్తీలకు పాల్పడితే సహించేది లేదంటూ కఠిన ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక వేయింగ్‌ మెషిన్లలో జరుగుతున్న మోసాల విషయంలోనూ పక్కాగా నిఘా ఉంచాలని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ అధికారులకు సూచించారు. వినియోగదారుల హక్కులకు ఎవరు భంగం కలిగించినా తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు. తూనికలు, కొలతలపై వినియోగదారుల్లో చైతన్యం పెంచాలని సూచించారు. తరచూ పెట్రోల్ బంకులు, షాపుల్లో తనిఖీల ద్వారా ప్రజలు మోసపోకుండా చూడొచ్చని పేర్కొన్నారు. ఇక తూనికలు కొలతల శాఖలో ప్రస్తుతం సిబ్బంది కొరత వేధిస్తుందని అన్నారు. త్వరలోనే ఆయా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పుకొచ్చారు.

Show comments