iDreamPost

ప్రయాణికులకు TSRTC గుడ్‌న్యూస్‌.. ఇక, చిల్లర కష్టాలు తీరినట్లే..

ప్రయాణికులకు TSRTC గుడ్‌న్యూస్‌.. ఇక, చిల్లర కష్టాలు తీరినట్లే..

తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్‌ నగర ప్రజలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆర్టీసీ ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు టెక్నాలజీని తెరపైకి తీసుకురానుంది. సిటీ బస్సుల్లో యూపీఐ పేమెంట్లకు శ్రీకారం చుట్టబోతోంది. అతి త్వరలో సీటీ బస్సుల్లో డిజిటల్‌ పేమెంట్ల ద్వారా లావాదేవీలు జరగనున్నాయి. ప్రయాణికులు తమ దగ్గర చిల్లర లేకపోయినా.. యూపీఐ చేసి టికెట్‌ పొందవచ్చు. ఈ డిజిటల్‌ పేమెంట్ల ద్వారా సిటీ బస్సుల కండెకర్టకు ఎంతో మేలు జరగనుంది. చిల్లర సమస్యకు కూడా పరిష్కారం దొరకనుంది. ప్రస్తుతం ఆర్టీసీకి సంబంధించిన మెట్రో లగ్జరీ, ఏసీ బస్సుల్లో యూపీఐ విధానం విజయవంతంగా అమలవుతోంది.

త్వరలో హైదరాబాద్‌లో ఉన్న 2,500కి పైగా ఉన్న ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో యూపీఐ సేవల ద్వారా టికెట్‌ జారీ చేసే ప్రక్రియ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి సిటీ బస్సుల్లో యూపీఐ డిజిటల్‌ లావాదేవీల ద్వారా టికెట్‌ జారీ చేసేందుకు అన్ని బస్సుల్లో ఐ-టీమ్స్‌ యంత్రాలను ఆర్టీసీ యజమాన్యం అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే ఐ-టీమ్స్‌ యంత్రాలను పంపిణీ చేసే సంస్థతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. మరి, త్వరలో సీటీ బస్సుల్లో యూపీఐ పేమెంట్ల టిక్కెట్లు ఇచ్చే విధానంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి