iDreamPost

ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే సింగిల్ టైర్ ఎలక్ట్రిక్ సైకిల్.. ధర ఎంతంటే?

UniCycle: చిన్న చిన్న దూరాలకు కూడా బండి తీయాలంటే ట్రాఫిక్ లో ఇరుక్కుపోతామేమో అన్న భయం. నడిచి వెళ్లాలంటే కాళ్ళ నొప్పులు. అసలు నడక అలవాటు పోయి ఉంటుంది. అలాంటి వారికి చక్కని సొల్యూషన్ ఈ యూనీ సైకిల్. దీనికి ఒక టైర్ మాత్రమే ఉంటుంది.

UniCycle: చిన్న చిన్న దూరాలకు కూడా బండి తీయాలంటే ట్రాఫిక్ లో ఇరుక్కుపోతామేమో అన్న భయం. నడిచి వెళ్లాలంటే కాళ్ళ నొప్పులు. అసలు నడక అలవాటు పోయి ఉంటుంది. అలాంటి వారికి చక్కని సొల్యూషన్ ఈ యూనీ సైకిల్. దీనికి ఒక టైర్ మాత్రమే ఉంటుంది.

ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే సింగిల్ టైర్ ఎలక్ట్రిక్ సైకిల్.. ధర ఎంతంటే?

హైదరాబాద్ లాంటి నగరాల్లో ఆఫీసులకి వెళ్లి రావాలంటే చెమటలు కాదు రక్తాలు చిందించే పరిస్థితి. ఆ ఎండలో రద్దీ వాహనాల మధ్య బండి తోలుతుంటే అబ్బా ఆ బాధలు వర్ణనాతీతం. మరోవైపు పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు, పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం. వీటన్నిటికీ చెక్ పెట్టేలా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చింది. ఈ సైకిల్ తో ట్రాఫిక్ కష్టాలు ఉండవు, పెట్రోల్ భారం ఉండదు. కాలుష్యం అస్సలు ఉండదు. దీన్ని విదేశాల్లో ఎక్కువ మంది వాడుతున్నారు. ట్రాఫిక్ అయినా కూడా దీన్ని చిన్న చిన్న ఇరుకు ప్లేసుల్లో వేసుకుని పోవచ్చు. హెవీ ట్రాఫిక్ ఉంటే దీన్ని చేత్తో పట్టుకుని ట్రాఫిక్ లేని చోట పెట్టి మళ్ళీ యధావిధిగా ప్రయాణం కొనసాగించవచ్చు. దీనికి ఒకే ఒకే చక్రం ఉంటుంది. అందులోనే మోటార్, బ్యాటరీ వస్తాయి. ఇది ప్రస్తుతం హైదరాబాద్ లో హల్చల్ చేస్తుంది.

దీన్ని ప్రణయ్ అనే ఐటీ ఉద్యోగి హైదరాబాద్ లో వినియోగంలోకి తీసుకొచ్చారు. మొదట ఈయన యూరప్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఈ సైకిల్ ని వాడడం చూసి ఆశ్చర్యపోయారు. ఇలాంటిది ఇండియాలో వాడితే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది. మొదట కొరియా నుంచి ఒక యూనీ సైకిల్ ని ఆర్డర్ చేశారు. ఈ యూనీ సైకిల్ మీదనే ఈయన తన ఆఫీసుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఇందులో మొత్తం మూడు రకాల మోడల్స్ ఉన్నాయి. ఒకటి 16 అంగుళాల టైర్ సైజుతో వస్తున్న సైకిల్. ఇది సింగిల్ ఛార్జ్ తో 75 కి.మీ. నడుస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే 5 గంటల సమయం పడుతుంది. మరొకటి 45 కి.మీ. రేంజ్ ఇచ్చే సైకిల్ ఉంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 3 గంటల సమయం పడుతుంది.

ఇంకొకటి 19 అంగుళాల సైజు ఉన్న యూనీ సైకిల్. ఇది సింగిల్ ఛార్జ్ తో 160 కి.మీ. నడుస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే త్వరగా ఛార్జింగ్ ఎక్కుతుంది. కానీ స్లో ఛార్జింగ్ వల్ల ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 11 గంటలు పడుతుంది. 19 అంగుళాల టైర్ సైకిల్  కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. స్పీడ్ ని అదే కంట్రోల్ చేసుకుంటుంది. గతుకు రోడ్లలో కూడా బాగా వెళ్తుంది. కారుతో సమానమైన వేగంతో కూడా వెళ్ళచ్చు. రోడ్డు పరిస్థితిని బట్టి వేగాన్ని నియంత్రించుకుంటుందని ప్రణయ్ అన్నారు. దీన్ని కొరియా నుంచి దిగుమతి చేసుకున్నారని.. మిగతా రెండు మన దేశంలో తయారు చేసినవే అన్నారు. అయితే దీని మీద ప్రయాణం అంటే కత్తి మీద సాములాంటిదే. కానీ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుందని అంటున్నారు.

పెట్రోల్ అవసరం లేకుండా తక్కువ దూరాలకు దీని మీద ట్రాఫిక్ లో ఇబ్బంది పడకుండా వెళ్ళచ్చు. అలానే వేరే నగరాలకు వెళ్ళినప్పుడు దీన్ని సులువుగా మోసుకెళ్ళచ్చునని అంటున్నారు. దీని ధర ఎంత అనేది చెప్పలేదు కానీ 30 వేలు ఉంటుందని సమాచారం. అయితే ఇలాంటివి వేరే బ్రాండ్ యూనీ సైకిల్స్ మన ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. ర్యాడ్ బోర్డ్స్ కంపెనీకి చెందిన యూనీ సైకిల్ ఒకటి ఉంది. అది 20 కి.మీ. మైలేజ్ తో గంటకు 20 కి.మీ. టాప్ స్పీడ్ తో వస్తుంది. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే 2 గంటల సమయం పడుతుంది. ఇది 14 అంగుళాల సింగిల్ టైర్ తో వస్తుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 71,430 కాగా ఆఫర్ లో 50 వేలకు అందుబాటులో ఉంచింది. దీన్ని స్మార్ట్ ఫోన్ కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి