P Venkatesh
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద నిరుద్యోగులు నిరసనకు దిగారు. అసలు నిరుద్యోగులు ఫుడ్ స్టాల్ వద్ద నిరసన చేపట్టడం ఏంటని ఆలోచిస్తున్నారా? నిరసనకు గల కారణం ఏంటంటే?
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద నిరుద్యోగులు నిరసనకు దిగారు. అసలు నిరుద్యోగులు ఫుడ్ స్టాల్ వద్ద నిరసన చేపట్టడం ఏంటని ఆలోచిస్తున్నారా? నిరసనకు గల కారణం ఏంటంటే?
P Venkatesh
ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ అంశం మాత్రమే. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అంతటా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వ్యవహారం వైరల్ గా మారింది. ఫుడ్ స్టాల్ కు కస్టమర్ల తాకిడి ఎక్కువ కావడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆమె ఫుడ్ స్టాల్ ను తొలగించారు. ఇక ఈ వ్యవహారం సీఎం రేవంత్ వద్దకు చేరింది. దీనిపై స్పందించిన ఆయన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ నడుపుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.
అంతేకాదు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఫుడ్ స్టాల్ ను సందర్శించనున్నట్లు కూడా సోషల్ మీడియా వేదికగా అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు నిరుద్యోగుల సెగ తగిలింది. ఫుడ్ స్టాల్ వద్దకు నిరుద్యోగులు చేరుకుని నిరసనకు దిగారు. రేవంత్ రెడ్డి మీ ఫుడ్ స్టాల్ వద్దకు వస్తాను అన్నారు కదా.. జీవో 46 రద్దు చేయమని ఆయనతో చెప్పండి అంటూ నిరుద్యోగులు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద నిరసనకు దిగారు.
అసలు కారణం ఏంటంటే.. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో జీవో 46 ను రద్దు చేయాలని కొంత కాలంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్లో రాష్ట్రస్థాయి పోస్టులకు జీవో 46 కారణంగా హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 56 శాతం పోస్టులు భర్తీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మిగిలిన జిల్లాలకు 44 శాతం మాత్రమే కేటాయిస్తున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మా గోడును మీరైనా సీఎంతో చెప్పండి అంటూ నిరుద్యోగులు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద నిరసనకు దిగారు. మరి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద నిరుద్యోగులు నిరసనకు దిగిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద నిరుద్యోగుల నిరసన!
రేవంత్ రెడ్డి మీ ఫుడ్ స్టాల్ వద్దకు వస్తాను అన్నారు కదా జీవో 46 రద్దు చేయమని ఆయనతో చెప్పండి అంటూ నిరుద్యోగుల నిరసన.#KumariAunty #RevanthReddy pic.twitter.com/kH6zcgCic9
— Telugu Scribe (@TeluguScribe) February 3, 2024