P Venkatesh
పండుగ వేళ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు తమతో ఉన్న చిన్నారులు ఒక్కసారిగా విగతజీవులుగా మారడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది.
పండుగ వేళ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు తమతో ఉన్న చిన్నారులు ఒక్కసారిగా విగతజీవులుగా మారడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది.
P Venkatesh
దీపావళి పండగ దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగ జరుపుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో పూజలు చేసుకుని బాణాసంచా కాలుస్తూ సంతోషంగా గడుపుతున్నారు. అయితే పండుగ వేళ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకంలో ముంచింది. అప్పటి వరకు తమతో ఉన్న చిన్నారులు ఒక్కసారిగా విగతజీవులుగా మారడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. టపాసులు కొనుక్కోవడానికి వెళ్లి రోడ్డు ప్రమాదభారిన పడి అన్నదమ్ములిద్దరు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మెదక్ జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న వారిని టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. దీపావళి పండగను పురస్కరించుకుని బాణాసంచా కావాలని ఆ చిన్నారులు తల్లిని కోరారు. దీంతో వారికి టపాసులు ఇప్పించేందుకు స్కూటీపై ఎక్కించుకుని షాప్ కు బయలుదేరారు. అలా వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో టిప్పర్ రూపంలో మృత్యువు వెంటాడింది. స్కూటీని టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా తల్లి స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడింది. కాగా మృతి చెందిన చిన్నారులను పృద్విరాజ్(12), ఫణితేజ,(10)గా గుర్తించారు.
అయితే మృతి చెందిన చిన్నారుల తండ్రి టెక్మాల్ మండలంకు చెందిన హోంగార్డ్ శ్రీనివాస్ రెండేళ్ల క్రితం ప్రమాదంలో చనిపోయాడు. తల్లి సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తూ పిల్లలను సాకుతుంది. అప్పుడు భర్త, ఇప్పుడు పిల్లలిద్దరు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె శోక సాగరంలో మునిగిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరితరము కాలేదు. పండగ పూట విషాదం నెలకొనడంతో అక్కడున్న వారి కళ్లు చెమ్మగిల్లాయి. కాగా ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.