iDreamPost
android-app
ios-app

Tomato Price: టమాటా సాగుతో కోట్లు సంపాదిస్తున్న తెలంగాణ రైతు.. ఆ చిన్న ట్రిక్కుతో

  • Published Jun 20, 2024 | 2:35 PM Updated Updated Jun 20, 2024 | 2:35 PM

కూరగాయల సాగుతో కూడా కోటీశ్వరలు కావొచ్చని నిరూపిస్తున్నారు కొందరు రైతులు. టమాటా సాగు చేసి కోట్లు సంపాదించిన ఓ రైతు సక్సెస్‌ స్టోరీ మీ కోసం..

కూరగాయల సాగుతో కూడా కోటీశ్వరలు కావొచ్చని నిరూపిస్తున్నారు కొందరు రైతులు. టమాటా సాగు చేసి కోట్లు సంపాదించిన ఓ రైతు సక్సెస్‌ స్టోరీ మీ కోసం..

  • Published Jun 20, 2024 | 2:35 PMUpdated Jun 20, 2024 | 2:35 PM
Tomato Price: టమాటా సాగుతో కోట్లు సంపాదిస్తున్న తెలంగాణ రైతు.. ఆ చిన్న ట్రిక్కుతో

కూరగాయలు ధరలు చూసి సామాన్యులకు హార్ట్‌ ఎటాక్‌ వస్తుంది. మరీ ముఖ్యంగా టమాటా, ఉల్లిపాయ ధరలు చూసి గుండెలు బాదుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నిన్న, మొన్నటి వరకు ఈ రెండు కూరగాయల ధరలు 50 రూపాయల్లోపు ఉండేవి. పైగా ఈ రెండు లేకపోతే కూర చేయలేం. దాంతో వీటికి సీజన్‌తో పని లేకుండా డిమాండ్‌ భారీగా ఉంటుంది. అయితే ప్రతి ఏటా వర్షాకాలం సీజన్‌ ప్రారంభంలో కూరగాయల ధరలు కొండెక్కుతాయి. టమాటా, ఉల్లి ధరలు గరిష్టంగా చెప్పాలంటే.. 50 రూపాయల వరకు చేరతాయి.

కానీ గత ఏడాది నుంచి ట్రెండ్‌ మారింది. టమాటా ధర 100 రూపాయలు దాటి రెండొందల దిశగా పరుగులు తీస్తుంది. ఇక ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల.. ప్రస్తుతం మార్కెట్‌లోకి టమాటా దిగుబడి బాగా తగ్గిపోయింది. దాంతో ధర చుక్కలను తాకుతుంది. ప్రస్తుతం టమాటా ధర కిలో 100 రూపాయలకు చేరింది. ఇక టమాటా రేటు చూసి సామాన్యులు భయపడుతుంటే.. దాన్ని సాగు చేసిన వారు మాత్రం సంతోషంగా ఉన్నారు. గతేడాది ఎందరినో ధనవంతులు చేసిన టమాటా.. ఈ ఏడాది కూడా అదే పని చేస్తోంది. టమాటా సాగుతో తెలంగాణలోని ఓ రైతు కోటీశ్వరుడు అయ్యాడు. ఆ వివరాలు..

కిలో రూ.100

ప్రస్తుతం మార్కెట్‌లో టమాటా రేటు కిలో రూ.100 అమ్ముడవుతోంది. ఆదివారం ఇది 80 రూపాయలుగా ఉంది. ఇక సాధారణంగా నగరంలోని స్థానిక మార్కెట్‌లకు సంగారెడ్డి, సిద్ధిపేట, మెదల్‌ జిల్లాల రైతుల వద్ద నుంచి టమాటాలు వస్తాయి. అలానే హైదరాబాద్‌లోని బోయినపల్లి, సిద్ధిపేట జిల్లాలోని వంటిమామిడి మార్కెట్‌ నుంచి టమాటాలు వస్తాయి. ఇక్కడి స్థానిక రైతులు ఈ సీజన్లో టమాటా పంట సాగు చేస్తారు. ఇప్పుడు దిగుబడి తక్కువగా ఉండటంతో.. ధర పెరుగుతుంది. దాంతో ఈ సీజన్‌లో టమాటా సాగు చేసిన రైతుల పంట పండుతుంది. సరిగా ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యి.. టమాటా సాగు చేసి కోటీశ్వరుడు అయ్యాడు ఓ తెలంగాణ రైతు. ఆయన సక్సెస్‌ స్టోరీ మీ కోసం..

టమాటా సాగుతో కోట్లు సంపాదిస్తోన్న రైతు..

గత ఏడాది టమాటా సాగు చేసిన ఎందరో రైతులు కోటీశ్వరులు, లక్షాధికారులు అయిన సంగతి తెలిసిందే. వారిలో తెలంగాణ, మెదక్‌ రైతు బాన్సువాడ మహిపాల్‌ రెడ్డి కూడా ఒకరు. గత ఏడాది ఆయన టమాటాలు అమ్మి కోటీశ్వరుడు అయ్యారు. ఆయనకు వచ్చిన లాభాలు చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. అయితే మార్కెట్‌లో కొరత వచ్చే సమయానికి.. పంట చేతికొచ్చే విధంగా టమాటా సాగు చేయడమే తన విజయానికి కారణం అంటున్నాడు మహిపాల్‌ రెడ్డి. ఇందులో భాగంగా తాను ఏప్రిల్‌-మే నెలలో టమాటా పంట నాటుతానని.. అది సరిగ్గా జూన్‌-ఆగస్టు మధ్య పంట చేతికి అందుతుందని.. ఆ సమయంలో మార్కెట్‌లో టమాటాకు కొరత ఏర్పడి.. ధర భారీగా ఉంటుందని.. అదే తనకు కలిసి వస్తుంది అని చెప్పుకొచ్చారు.

ఇక గత ఏడాది 8 ఎకరాల్లో టమాటా సాగు చేసిన మహిపాల్‌ రెడ్డి.. ఈ ఏడాది ఏకంగా 30 ఎకరాలకు విస్తరించినట్లు వెల్లడించాడు. వేసవిలో టమాటా సాగు కోసం రైతులు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని.. మరీ ముఖ్యంగా వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతల నుంచి పంటను కాపాడుకునేందుకు తగిన నీటి వసతి ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఇక టమాటా సాగుకు తనకు మొత్తం 3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందని.. చలికాలంలో ఇంత మొత్తం కాదని.. కేవలం 2 లక్షల్లోపు అవుతుందని చెప్పుకొచ్చాడు.

ఇక గతేడాది టమాటా సాగుతో భారీ లాభాలు చవి చూసిన మహిపాల్‌ రెడ్డి.. ఈ ఏడాది ఏకంగా 30 ఏకరాల్లో టమాటా పండించి మళ్లీ కోట్ల రూపాయలు ఆర్జించే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమాటా ధర 80-100 రూపాయలుగా ఉందని హోల్‌సెల్‌ మార్కెట్‌లో కూడా మంచి ధర ఉందని.. ఈ ఏడాది కూడా భారీగా లాభాలు వస్తాయని మహిపాల్‌ రెడ్డి భావిస్తున్నారు. కూరగాయల సాగులో అన్నదాతలు మహిపాల్‌ రెడ్డిని ఫాలో అయితే బెటర్‌ అంటున్నారు వ్యవసాయ శాఖ నిపుణులు.