Arjun Suravaram
Reliance Store: తెలంగాణ ఫుడ్ సేఫ్టి అధికారులు నాణ్యత పాటించని హోటళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎంత పెద్ద హోటల్, రెస్టారెంట్ అయినా సరే.. నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే కొరడ ఝుళిపిస్తున్నారు. తాజాగా మున్సిపల్ అధికారులు రిలయన్స్ సూపర్ స్టోర్ పై దాడులు చేశారు.
Reliance Store: తెలంగాణ ఫుడ్ సేఫ్టి అధికారులు నాణ్యత పాటించని హోటళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎంత పెద్ద హోటల్, రెస్టారెంట్ అయినా సరే.. నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే కొరడ ఝుళిపిస్తున్నారు. తాజాగా మున్సిపల్ అధికారులు రిలయన్స్ సూపర్ స్టోర్ పై దాడులు చేశారు.
Arjun Suravaram
తెలంగాణ సర్కార్ ఆహార భద్రత, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడటం లేదు. ఇటీవల కాలంలో హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు చేశారు. అంతేకాక ఈ తనిఖీలు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆహారం విషయంలో నాణ్యతను, శుభ్రతను పాటించని పలు రెస్టారెంట్లకు, హోటళ్లలకు నోటీసులు జారీ చేశారు. అంతేకాక పలు ఫుడ్ మార్కెట్లపై కూడా అధికారులు దాడులు చేశారు. ఇంకా ఈ తనిఖీలను అధికారులు కొనసాగిస్తున్నారు. తాజాగా ఏకంగా రిలయన్స్ సూపర్ స్టోర్ లో అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో కొన్ని కీలక అంశాలను అధికారులు గుర్తించారు.
సాధారణ హోటళ్లలోనే కాదు ప్రముఖ రెస్టారెంట్ లలో సైతం భోజనం చేయాలంటే సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు. రాష్ట్రవ్య్రాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లు,హోటళ్ల పై వరుసగా దాడులు జరుపుతూ కేసులు నమోదు చేశారు. ఇలా కేవలం హోటల్స్ పైనే కాకుండా సూపర్ మార్కెట్లలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రముఖ సూపర్ మార్కెట్లను సైతం అధికారులు వదలడం లేదు. తాజాగా మెదక్ జిల్లాలోని రిలయన్స్ సూపర్ స్టోర్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మెదక్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రిలయన్స్ సూపర్ స్టోర్ ఉంది. ఇక్కడ సోమవారం ఈ స్టోర్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
రిలయన్స్ సూపర్ స్టోర్లో పాడై పోయిన పండ్లు అమ్ముతున్నారని అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో సోమవారం మేరకు మెదక్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ సందర్భంగా రిలయన్స్ స్టోర్కు వెళ్లిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే పాడైపోయిన పండ్లు, గింజలు స్టోర్లో ఉండటాని అధికారులు గుర్తించారు. దీంతో పాడైపోయిన పండ్లను డంపింగ్ యార్డుకు తరలించారు. అంతేకాక కుళ్లిపోయిన ఫ్రూట్స్ ను విక్రయింనందుకు రిలయన్స్ స్టోరికి జరిమాన విధించారు. నాణ్యతను పాటించని కారణంగా రూ.10 వేలు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. ఇక సూపర్ స్టోర్ లోని తనిఖీల్లో మున్సిపల్శానిటరీ జవాన్లు శ్రీనివాస్, వార్డు ఆఫీసర్లు నాగేంద్రబాబు, దౌలయ్య, మహబూబ్ పాల్గొన్నారు.
గత కొంతకాలం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆహారం, వైద్యానికి సంబంధించన వాటిల్లో జరిగే అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలోనే నాణ్యతలేని ఆహారం సప్లయ్ చేస్తున్న హోటల్లపై , అలానే చిన్న చిన్న ఆస్పత్రులు పెట్టి వైద్యులుగా చలామాని అవుతున్న కొందరు నకిలీ డాక్టర్లను గుర్తించి..వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాక ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి.. లంచం తీసుకునే వారిని పట్టుకున్నారు. సూపర్ మార్కెట్లపై కూడా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో శేరిలింగపల్లి ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్ గోడౌన్ పై దాడులు చేసి.. గడువు తేదీ అయిపోయిన వస్తువులను గుర్తించారు. అంతేకాక ఆ గోడౌన్ ను సీజ్ చేశారు. తాజాగా మెదక్ లోని రిలయన్స్ లో తనిఖీలు చేసి..వారికి జరిమానా విధించారు.