iDreamPost
android-app
ios-app

SI వేధింపులు..స్టేషన్‌లోనే మహిళా ASI దారుణ నిర్ణయం

ఓ మహిళా ఏఎస్సై.. ఎస్ఐ పై తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు లీవ్ ఇవ్వకుండా వరుసగా డ్యూటీలు వేస్తూ హెర్రాస్ చేస్తున్నాడని, తాను విధులకు హాజరైనా కూడా అబెంట్స్ వేస్తున్నాడని ఎస్సై యాదగిరిపై ఆరోపణలు చేసింది. చివరకు

ఓ మహిళా ఏఎస్సై.. ఎస్ఐ పై తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు లీవ్ ఇవ్వకుండా వరుసగా డ్యూటీలు వేస్తూ హెర్రాస్ చేస్తున్నాడని, తాను విధులకు హాజరైనా కూడా అబెంట్స్ వేస్తున్నాడని ఎస్సై యాదగిరిపై ఆరోపణలు చేసింది. చివరకు

SI వేధింపులు..స్టేషన్‌లోనే మహిళా ASI దారుణ నిర్ణయం

సామాన్యులకు అన్యాయం జరిగినా, ఆపద కల్గినా.. తొలుత ఆశ్రయించేది పోలీసులనే. సినిమాల ప్రభావం వల్ల ఖాకీలంటే కొంత భయం, నెగిటివిటీ ఉన్నప్పటికీ.. తమకు న్యాయం చేసేది నీతి, చట్టం, ధర్మం పరిరక్షించే పోలీస్ వ్యవస్థే అని బలంగా నమ్ముతారు. అయితే రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తే.. అందులోనూ తోటి ఉద్యోగిని చిత్రవధకు గురి చేస్తే.. ఇదే పరిస్థితి ఎదురైంది ఓ మహిళా ఉద్యోగికి. ఏం చేయాలో తోచక ఆత్మహత్య యత్నించింది. ఎస్సై వేధింపులకు తట్టుకోలేక ఎఎస్ఐ సూసైడ్ ఎంటప్ట్ చేసింది. మెదక్ – చిలిప్చేడ్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న యాదగిరి వేదిస్తున్నారంటూ ఆవేదనతో ఆత్మహత్యకు యత్నించింది ఏఎస్సై సుధారాణి. కావాలనే తనను యాదగిరి టార్గెట్ చేస్తున్నాడంటూ ఆవేదన చెందుతుంది. ఇవే కాదు యాదగిరి చేస్తున్న వేధింపులను ఏకరువు పెట్టింది ఎఎస్సై సుధారాణి.

తనకు లీవ్ ఇవ్వకుండా ఎస్ఐ యాదగిరి వరుసగా డ్యూటీలు వేస్తూ ఇబ్బందికి హెర్రాస్ చేస్తున్నాడు . అంతేకాకుండా తాను విధులకు హాజరైనా కూడా అబెంట్స్ వేస్తున్నాడు. ఈ వేధింపులు తట్టుకోలేక.. పోలీస్ స్టేషన్‌లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకునేందుకు యత్నించినట్లు చెబుతుంది సుధారాణి. ఆమెను చూసిన తోటి సిబ్బంది.. జోగిపేట ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఎస్సై తనతో దురుసుగా ప్రవర్తిస్తూ, కక్షపూరితంగా దుర్బాషలాడుతూ తనను మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పేర్కొంది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ వేడుకుంది. అయితే ఆమె విధులకు సరిగా హాజరు కాకపోవడంతోనే గైర్హాజరు వేసినట్లు చెబుతున్నాడు యాదగిరి. పోలీస్ స్టేషన్‌లోనే మహిళా ఏఎస్ఐ ఆత్మహత్యకు యత్నించడంపై పోలీస్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ వేశారు అధికారులు. ఏఎస్ఐ, ఎస్ఐ విధులకు సక్రమంగా హాజరు అవుతున్నారా లేదా…? గతంలో పని చేసిన వర్క్ ప్లేసులో సరిగ్గా విధులకు హాజరయ్యారా లేదా అనేది కూడా కమిటీ తేల్చనుంది. ఈ ఇద్దరి సత్ప్రవర్తన, వీరిపై గతంలో ఏమన్నా ఫిర్యాదులు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేపట్టనుంది కమిటీ. సుధారాణిని నిజంగా ఎస్ఐ యాదగిరి టార్గెట్ చేస్తున్నాడా..? ఆమె విధులకు హాజరైనా కూడా గైర్హాజరు ఎందుకు వేస్తున్నాడు అనే కోణంలో విచారించనున్నారు. అయితే యాదగిరి, సుధారాణిలతో ఉన్నాతాధికారులు మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇక నిజనిర్ధారణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తప్పు ఎవరిదే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవచ్చునని తెలుస్తుంది.   ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించుకోవాల్సిన పోలీసులు..  తోటి ఉద్యోగులపై  కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.