Tummala Nageswara Rao-Rythu Runa Mafi: రూ. 2లక్షల రుణమాఫీ కాలేదా.. కంగారు లేదంటున్న సర్కార్‌.. ఇలా చేయండి

Runa Mafi: రూ. 2లక్షల రుణమాఫీ కాలేదా.. కంగారు లేదంటున్న సర్కార్‌.. ఇలా చేయండి

Tummala Nageswara Rao-Rythu Runa Mafi: మీరు రుణమాఫీకి అర్హులైనా సరే హామీ వర్తించలేదా.. అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటుంది సర్కార్‌. ఆ వివరాలు..

Tummala Nageswara Rao-Rythu Runa Mafi: మీరు రుణమాఫీకి అర్హులైనా సరే హామీ వర్తించలేదా.. అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటుంది సర్కార్‌. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల్లో ఇచ్చిన కీలకమైన హామీ రైతు రుణమాఫీని విజయవంతంగా అమలు చేసిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. అన్నట్లుగానే.. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేసి.. రేవంత్‌ సర్కార్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. నెల రోజుల వ్యవధిలోనే మూడు దశల్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ పూర్తి చేసింది. ఇక తాజాగా ఆగస్టు 15 నాడు.. మూడో విడత రుణమాఫీలో భాగంగా 2 లక్షల రూపాయల వరకు ఉన్న లోన్‌ని మాఫీ చేసింది. అయితే అర్హతలున్నా కొందరికి రుణమాఫీ కాలేదు. అలాంటి వారికి తెలంగాణ సర్కార్‌ శుభవార్త చెప్పింది. ఇలా చేయమని సూచించింది. ఆ వివరాలు..

రైతు రుణమాఫీపై విపక్షాల విమర్శల నేపథ్యంలో.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు వీటిపై ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి అమలు చేస్తున్న పథకాలతో ప్రజల్లో పార్టీ పట్ల పెరుగుతున్న నమ్మకం చూసి.. తమ రాజకీయ మనుగడ కాపాడుకొనేందుకు విపక్ష పార్టీలు పడ్తున్న పాట్లు చూసి జాలి వేస్తుందన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయడంతో.. విపక్షాలు షాక్‌లో ఉన్నాయని.. ఏం చేయాలో అర్థం కాక.. తమ మీద విషం చిమ్ముతున్నాయని మంత్రి తుమ్మల మండిపడ్డారు. బ్యాంకుల నుంచి అందిన ప్రతి ఖాతాదారునికి వారి అర్హత బట్టి మాఫీ చేసే బాధ్యత తమ ప్రభుత్వానికి ఉందన్నారు.

అర్హత ఉన్నా.. కొందరికి రైతు రుణమాఫీ కాలేదని.. అలాంటి వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా వెల్లడించారు. రూ. 2 లక్షలపైన ఉన్న ఖాతాలకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వారు ముందు 2 లక్షల కంటే అదనంగా పొందిన రుణాన్ని చెల్లిస్తే.. ఆ తర్వాత.. వారి అర్హతను బట్టి రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. బ్యాంకర్ల నుంచి వచ్చిన డేటాలో తప్పుగా ఉన్న రైతుల వివరాలును కూడా సేకరిస్తున్నామని చెప్పారు. రుణ మాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాల్సిందిగా బ్యాంకర్లను కోరినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ కోసం తమ ప్రభుత్వం రూ.31,000 కోట్లు నిధులు కేటాయించినట్లు చెప్పారు. అర్హత ఉండి మాఫీ అందని రైతులకు కూడా రుణమాఫీ చేస్తామన్నారు.

Show comments