Arjun Suravaram
తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లోకి చేరే అంశంపై స్పష్టత వచ్చింది. ఆయన బీఆర్ఎస్ లోకి చేరేందుకు మూహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదనే కారణంతో మనస్తాపం చెందిన కాసాని ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లోకి చేరే అంశంపై స్పష్టత వచ్చింది. ఆయన బీఆర్ఎస్ లోకి చేరేందుకు మూహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదనే కారణంతో మనస్తాపం చెందిన కాసాని ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Arjun Suravaram
తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదనే కారణంతో మనస్తాపం చెందిన కాసాని ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని టాక్ వినిపించింది. ఆ వార్తలను కాసాని కూడా ఖండించలేదు. తాజాగా కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లోకి చేరే అంశంపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఆయన చేరేందుకు మూహుర్తం ఫిక్స్ చేసుకున్నారు.
తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శుక్రవారం ఉదయం బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. ఉదయం 11.30 గంటలకు గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లోని ముఖ్యమంత్రి ఫాంహౌస్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో కాసాని గులాబీ కండువా కప్పుకోనున్నారు. సీఎం ఫాంహౌజ్ కావడంతో భద్రతా పరమైన కారణాల దృష్ట్య పరిమిత సంఖ్యలో తన అనుచరులతో కలిసి కాసాని బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీఆర్‌ఎస్ ఇప్పటికే ప్రకటించింది. అందుకే కాసానికి టికెటు ఇచ్చేఅవకాశం లేకపోవడంతో, భవిష్యత్‌లో ఎమ్మెల్సీ లేదా మరేదైన కీలక పదవి ఇచ్చి న్యాయం చేయాలని గులాబీ బాస్ సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
కాసాని కూడా గతంలోలాగే ఎమ్మెల్సీ సీటే ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా టీటీడీపీ అధ్యక్షుడిగా పని చేసిన ఎల్. రమణకు కూడా బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ పదవి వరించింది. అదే దారిలో కాసానికి ఎమ్మెల్సీ పదవి రావొచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీచేయద్దని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించడంతో మనస్తాపానికి గురైన కాసాని పార్టీకి రిజైన్ చేశారు. తాను టీటీడీపీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, అంతా వృథా అయిందని మీడియా సాక్షిగా కాసాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌లోకి వెళ్తేనే బాగుంటుందన్న క్యాడర్ సలహా మేరకు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలని కాసాని నిర్ణయించినట్లు సమాచారం. మరి.. కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లోకి చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.